కిలో 25కే భారత్ బ్రాండ్ బియ్యం

కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార భద్రతకు సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తుంది

  • By: Somu    latest    Dec 27, 2023 11:35 AM IST
కిలో 25కే భారత్ బ్రాండ్ బియ్యం
  • కేంద్రం నిర్ణయం


విధాత : కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార భద్రతకు సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తుంది. భారత్ రైస్ పేరుతో 25రూపాయలకే కిలో నాణ్యమైన బియ్యాన్ని అందించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సరసమైన ధరలకు ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో గోధుమ, పప్పులను కేంద్రం విక్రయిస్తుంది.


ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కరోనా సమయం నుంచి పేదలకు గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద అందిస్తున్నఐదు ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడగించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కొత్తగా 25రూపాయలకే కిలో భారత్‌ బ్రాండ్‌ బియ్యం తేనుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.