Manchiryala: మాజీ MLC ప్రేమసాగర్ అవినీతి సొమ్ముతో భట్టి పాదయాత్ర: MLA దివాకర్‌రావు
భట్టికి ధైర్యం ఉంటే ప్రేమ్‌సాగర్ రావు కబ్జా చేసిన ఆస్తులను బాధితులకు ఇప్పించాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు, ఇన్‌చార్జి నరదాస్ లక్ష్మణరావు విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలూ దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరముందని మంచిర్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ కార్యకర్తల […]

- భట్టికి ధైర్యం ఉంటే ప్రేమ్‌సాగర్ రావు కబ్జా చేసిన ఆస్తులను బాధితులకు ఇప్పించాలి
- ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు, ఇన్‌చార్జి నరదాస్ లక్ష్మణరావు
విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలూ దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరముందని మంచిర్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
టిఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బిజెపి అనవసర ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అవినీతి సొమ్ముతో 30 రోజుల పాదయాత్ర చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కోట్లాది రూపాయల కబ్జాలు, బ్యాంకులకు అప్పుల ఎగ్గొట్టి అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బులే భట్టి పాదయాత్రకు ఖర్చు చేశారని ఆరోపించారు. భట్టికి ధైర్యం ఉంటే అవినీతి సొమ్ము గురించి ప్రేమ సాగర్‌రావును నిలదీస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాదులోని ఉప్పల్‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు 61 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాడని, ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్‌కు తప్ప ఇతర పార్టీలకు లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ఏలుబడిలో అభివృద్ధిని మరిచిన నాయకులు కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు.. చేపట్టినా విమర్శలు చేయడం ఆనవాయితీగా మారిందన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అక్కడ ప్రవేశపెట్టని పథకాలను ఇక్కడ ఎలా సాధ్యం చేస్తారని ప్రశ్నించారు. మంచిర్యాలలో ఏర్పాటుచేసిన భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని, జనం లేక కుర్చీలు వెలవెలబోయాయని దివాకర్ రావు పేర్కొన్నారు. పని చేసే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారని హితువు పలికారు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకులు పగటి కలలు కంటున్నారని, పట్టుకొని 10 సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీకి అది ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటికీ ప్రతిపక్షాలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం ఇన్‌చార్జి నరదాసు లక్ష్మణరావు.. టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.
ఆత్మీయ సమ్మేళనంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజితురావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, పల్లె భూమేష్, 19 వార్డ్ కౌన్సిలర్ వంగపల్లి అనిత రవీందర్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.