Bhupalpalli | భూపాలపల్లిలో ఇండ్ల కేటాయింపుపై పునః పరిశీలన

Bhupalpalli డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో 18 అభ్యంతరాలు లబ్దిదారుల ఎంపికపై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ కలెక్టర్ భవేశ్ మిశ్రా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి(Bhupalpalli) జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పై వచ్చిన 18 అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తరువాత ఇండ్ల కేటాయింపుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులు అవకతవకలు జరిగాయని ఆరోపణలు […]

Bhupalpalli | భూపాలపల్లిలో ఇండ్ల కేటాయింపుపై పునః పరిశీలన

Bhupalpalli

  • డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో 18 అభ్యంతరాలు
  • లబ్దిదారుల ఎంపికపై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
  • కలెక్టర్ భవేశ్ మిశ్రా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాలపల్లి(Bhupalpalli) జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పై వచ్చిన 18 అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తరువాత ఇండ్ల కేటాయింపుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం తెలిపారు.

జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భూపాల్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్లతోపాటు, జర్నలిస్టు సంఘాలు కూడా ఈ విషయమై ఆరోపణలు చేశాయి. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

దీనిపై స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో కేటాయింపు లబ్ధిదారులను పరిశీలించాలని భావించి అభ్యంతరాలను స్వీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చిన గడువు ముగిసింది. దీనిపై కలెక్టర్ స్పందించారు.

పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 100% సబ్సీడితో పూర్తి ఉచితంగా అర్హులైన పేదలకు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న 544 ఇండ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను నోటిస్ బోర్డు పై ఏప్రిల్ 13 న అతికించి అభ్యంతరాలు కోరుతూ ఏప్రిల్ 21 వరకు గడువు ఇచ్చామని ఆయన తెలిపారు.

జిల్లాలో గడువు ముగిసే నాటికి జాబితాలో ఉన్న 18 లబ్దిదారుల పై అభ్యంతరాలు వచ్చాయని, సదరు అభ్యంతరాల పై క్షేత్రస్థాయి పూర్తి స్థాయిలో పునః పరిశీలన చేపట్టిన పిదప 18 ఇండ్ల కేటాయింపు పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.