బుద్ధవనాన్ని సందర్శించిన భూటాన్ బౌద్ధ భిక్షువులు
విధాత: అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున పై హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో భూటాన్ దేశానికి చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యట శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్యకు సదస్సుకు సంబంధించి పలు సూచనలు చేశారు. మంత్రి సూచన మేరకు లక్ష్మయ్య ఆధ్వర్యంలో భూటాన్ సెంట్రల్ మొనస్ట్రీస్ కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ అధ్యక్షతన అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రతినిధులైన భూటాన్‌లోని 24 జిల్లాల […]

విధాత: అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున పై హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో భూటాన్ దేశానికి చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యట శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్యకు సదస్సుకు సంబంధించి పలు సూచనలు చేశారు.
మంత్రి సూచన మేరకు లక్ష్మయ్య ఆధ్వర్యంలో భూటాన్ సెంట్రల్ మొనస్ట్రీస్ కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ అధ్యక్షతన అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ప్రతినిధులైన భూటాన్‌లోని 24 జిల్లాల బౌద్ధ విహార ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం బుద్ధవనాన్ని గురువారం సందర్శించింది.
బుద్ధవనం చేరుకున్న ఈ బృందానికి బుద్ధవనం అధికారులు కె.సుధన్‌రెడ్డి, క్రాంతిబాబు, డి.ఆర్.శ్యాం సుందరరావు, బౌద్ధవిషయ నిపుణులు డా. ఈమని శివనాగిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తరువాత బుద్ధవనంలోని బుద్ధ చరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం మహా స్తూపం విశేషాలను భూటాన్ బౌద్ధ భిక్షువులకు బౌద్ధ విషయ నిపుణులు శివనాగిరెడ్డి వివరించారు.
కార్యక్రమంలో భూటాన్‌కు చెందిన థింపూలోని మొనాస్టిక్ డెవలప్‌మెంట్ కార్యాలయం ప్రధాన బౌద్ధాచార్యులు, ఇంకా, హా, వాంగ్డి, దగన, సిరంగ్, సర్బంగ్, బుంధాంగ్, త్రాంగ్సా, రగాంగ్, లుత్సే, మోన్‌గర్, త్రాషి, జోంబార్, త్రాషింగాంగ్ బుద్ధవిహారాల ప్రతినిధులు, కార్యదర్శులు, ఆడిటర్లు, లామానెటెన్‌లు పాల్గొన్నారు. బుద్ధవనంలో భూటాన్ విహారం నిర్మించటానికి ఆసక్తి చూపారు.కార్యక్రమంలో సాగర సీఐ నాగరాజు, ఎస్ ఐ రాంబాబు, బుద్ధవనం ఏఈ నాజిష్ తదితరులు పాల్గొన్నారు.