కాయిన్స్ కోసం కంటెస్టెంట్స్ కోసం.. గౌతమ్ మెడకి బెల్ట్ వేసి లాగిన తేజ

బిగ్ బాస్ సీజన్ 7 బుధవారం ఎపిసోడ్ చాలా రంజుగా సాగింది. ప్రతి వారం పవర్ అస్త్ర దక్కించుకునేందుకు పోటీ జరుగుతుండగా, ఇప్పటికే సందీప్, శివాజి, శోభా శెట్టిలు ఆ అస్త్రాన్ని దక్కించుకొని సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇప్పుడు నాలుగవ పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతుంది. ఇందుకు గాను కాయిన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో శివాజీ, సందీప్, శోభా శెట్టి బ్యాంకర్లుగా వ్యవహరిస్తుండగా, వారిలో ఒక్కొక్కరికి పదివేల విలువ చేసే కాయిన్స్ బిగ్ బాస్ ఇచ్చారు. ప్రతి కాయిన్ విలువ వంద రూపాయలు ఉండగా, వాటిని బ్యాంకర్స్ ఇతర సభ్యులకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్యాంకర్స్‌ని ఇంప్రెస్ చేసి ఎవరు ఎక్కువ కాయిన్స్ గెలుచుకుంటారో వారికి పవర్ అస్త్ర దక్కించుకునే అవకాశం వస్తుంది.
అయితే బ్యాంకర్స్‌గా ఉన్న సందీప్, శివాజి, శోభాలు కాయిన్స్ ఇచ్చేందుకు కంటెస్టెంట్స్‌తో తెగ ఆటలాడించారు. ఈ క్రమంలో తేజ 51, రాతిక 35, గౌతమ్ 24, ప్రియాంక 41, శుభ శ్రీ 31, ప్రశాంత్ 33, అమర్ 41, యావర్ 43 కాయిన్స్ దక్కించుకున్నారు. ఇక కాయిన్స్ దక్కించుకున్న తర్వాత కంటెస్టెంట్స్ బిగ్ బాస్ చెప్పినప్పుడు ముందుగా వెళ్లి బజర్ నొక్కాలి. ముందుగా బజర్ నొక్కిన వ్యక్తి పార్ట్నర్‌ని ఎంచుకొని ఆ తర్వాత వారిద్దరు పోటీదారులుగా ఇద్దరిని ఎంచుకోవాలి. అయితే తొలి రౌండ్‌లో అమర్ దీప్ ముందుగా బజర్ నొక్కగా, ఆయన తనకు పార్ట్నర్‌గా గౌతమ్‌ని ఎంచుకున్నారు. ఇక పోటీ దారులుగా రతిక, తేజ లని ఎంపిక చేసుకున్నారు. అనంతరం అమర్ దీప్, గౌతమ్ జంట.. తేజ, రతిక జంటతో పోటీ పడింది.
ఈ పోటీలో ఒక జంట శివాజీ వద్ద ఉన్న కెమెరా వద్దకు వెళ్లి స్మైలీ ఫోజులు దిగాల్సి ఉంటుంది, వేరు జంట వారు దిగకుండా అడ్డుపడాల్సి ఉంటుంది. అయితే ఫొటోలు దిగడానికి ప్రయత్నించే జంట నడుముకి బెల్డ్ కడతారు. ఆ బెల్ట్‌ని పట్టుకొని మాత్రమే ఫొటోలు దిగకుండా అడ్డుకోవల్సి ఉంటుంది.అయితే గౌతమ్ ఫొటోలు దిగే ప్రయత్నంలో తేజ బెల్ట్‌ని గౌతమ్ మెడకి వేశాడు. ఇది చూసిన కంటెస్టెంట్స్ మనోడిని గట్టిగానే మందలించారు. అయితే ఈ ఆటలో అమర్ దీప్, గౌతమ్ జంట ఎక్కువ ఫొటోలు దిగి విజేతలుగా నిలిచారు. తేజ, రతిక జంట ఓడిపోవడంతో వారు తమ కాయిన్స్‌ని గెలిచిన జంట అమర్ దీప్, గౌతమ్‌కి ఇచ్చారు.ఇక నేడు కూడా ఈ గేమ్ కొనసాగనుండగా, చివరికి ఎవరి వద్ద ఎక్కువ గేమ్స్ ఉంటాయో వారే విజేతలుగా నిలిచి పవర్ అస్త్ర దక్కించుకుంటారు.