Bigg Boss7:బిగ్ బాస్ హోస్ట్ ఎవ‌ర‌నే దానిపై వీడిన స‌స్పెన్స్.. కుడి ఎడ‌మైతే..

Bigg Boss7: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. ఈ షోకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఏడో సీజన్​లో పాల్గొననున్న కంటెస్టెంట్స్ ఎవ‌రు? హోస్ట్ ఎవరు? సహా పలు విషయాలపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే బిగ్ బాస్ అంటే ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో న‌డుస్తూ ఉంటుంది. కాని […]

  • By: sn    latest    Jul 19, 2023 2:00 AM IST
Bigg Boss7:బిగ్ బాస్ హోస్ట్ ఎవ‌ర‌నే దానిపై వీడిన స‌స్పెన్స్.. కుడి ఎడ‌మైతే..

Bigg Boss7: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. ఈ షోకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఏడో సీజన్​లో పాల్గొననున్న కంటెస్టెంట్స్ ఎవ‌రు? హోస్ట్ ఎవరు? సహా పలు విషయాలపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే బిగ్ బాస్ అంటే ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో న‌డుస్తూ ఉంటుంది. కాని గ‌త సీజ‌న్‌లో ఇలాంటివి ప‌ద్ద‌గా క‌నిపించ‌లేదు. అంతేకాకుండా ఎలిమినేష‌న్ విష‌యంలో కంటెస్టెంట్స్​కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ రావ‌డంతో కాస్త నెగెటివిటీ ఏర్ప‌డింది. దీంతో ఈ సారి నిర్వాహ‌కులు సీజ‌న్ 7 కోసం స‌రికొత్త స్కెచ్‌లే వేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

సీజ‌న్ 7కి హోస్ట్ కూడా మార‌బోతున్న‌ట్టు ప్ర‌చారాలు సాగాయి. కాని వాట‌న్నింటికి తెర‌దించుతూ తాజా ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్.బిగ్ బాస్-7 ప్రసారకర్త అయిన స్టార్ మా చానల్ తాజాగా నాగార్జునతో కూడిన ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో కుడి ఎడమైతే… పొరపాటు లేదోయ్ అంటూ నాగ్ చేసిన సందడిని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అంతేకాదు ప్రోమోలో అంతా రివ‌ర్స్ కావ‌డం కూడా చూపించారు. చూస్తుంటే బిగ్ బాస్ షో ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ గా ఉంటుందన్న సంకేతాలు నాగ్ నుంచి వెల్లడయ్యాయి అని చెప్పాలి.

ఇక కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే గ‌త సీజ‌న్ లో పాపుల‌ర్ కంటెస్టెంట్స్ పెద్ద‌గా లేకపోవ‌డం వ‌ల‌న షోకి నెగెటివిటీ వ‌చ్చింద‌ని భావించిన నిర్వాహ‌కులు ఈ సారి మాత్రం కంటెస్టెంట్స్ విష‌యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. మిత్ర, ఆదర్శ్, నోయల్ సహా సురేఖా వాణి, ఆమె కూతురు, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్లై, సీనియర్ ఉదయ్ భాను రానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. శ్వేతా నాయుడు, యాంకర్ ధనుశ్​, శోభితా శెట్టి.అమ‌ర్ దీప్ ఆయ‌న స‌తీమ‌ణి ఇలా కొంద‌రు కంటెస్టెంట్స్ పేర్లు అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.