BIHAR: మద్యనిషేధం కొనసాగిస్తాం: నితీష్‌కుమార్
ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు ఆపలేం కదా.. అలాగే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా అమలు చేస్తాం: సీఎం విధాత: బీహార్‌లో కల్తీ మద్యం సమస్య ప్రకంపనలు సృష్టిస్తున్నది. సరన్ జిల్లాలో గుడుంబా, కల్తీ సారాతో గత రెండు రోజుల్లోనే 39మంది చనిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. కల్తీ మద్యం మరణాలు ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మద్య నిషేధం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్ష పార్టీలు […]

- ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు ఆపలేం కదా..
- అలాగే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా అమలు చేస్తాం: సీఎం
విధాత: బీహార్‌లో కల్తీ మద్యం సమస్య ప్రకంపనలు సృష్టిస్తున్నది. సరన్ జిల్లాలో గుడుంబా, కల్తీ సారాతో గత రెండు రోజుల్లోనే 39మంది చనిపోయిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. కల్తీ మద్యం మరణాలు ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మద్య నిషేధం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మద్య నిషేధంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మద్య నిషేధంలో సమస్యలున్నాయన్నది వాస్తవమే. దీంతో తమ ఆదాయం కోల్పోయిన వారే మద్య నిషేధానికి తూట్లు పొడవటానికి ప్రయత్నిస్తున్నారని సీఎం నితీష్‌కుమార్ ఆరోపిస్తున్నారు. మద్య నిషేధంతో సమస్యలొస్తున్నాయని, కల్తీ మద్యం వస్తుందని ఎత్తివేయటం సరికాదన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాన్ని నిషేధించలేం కదా అని ప్రశ్నించారు.
ప్రజల సంక్షేమం కోసం ఏటా లక్షల కోట్ల నష్టం వచ్చినా మద్యనిషేధం అమలు చేసి తీరుతామని నితీష్ కుమార్ ప్రకటించారు. ఇప్పటికీ లక్ష కోట్లు ఆదాయం కోల్పోయినా ప్రజల సంక్షేమం కోసం మద్యనిషేధం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
కానీ నితీష్‌కుమార్‌కు ఒకప్పుడు అనుంగు అనుచరుడుగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు మద్య నిషేధాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. మద్య నిషేధంతో ఒనగూడే ప్రయోజనాలను ఒడిసిపట్టుకొంటూనే, కల్తీ మద్యాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది.