దేశ రాజకీయాలలో.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కథ నడుస్తున్నదా?

1951-1952 మొదటి 'ఒక దేశం ఒకే ఎన్నిక' విధా­నాన్ని ఆచ­ర­ణలో అమలు చేయా­లని ప్రధాని మోదీ ఎందుకు

దేశ రాజకీయాలలో.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కథ నడుస్తున్నదా?

నిల­దీసే శక్తు­లకు అసలే చోటి­వ్వొద్దు

మోదీ సర్కార్‌ నియంత పోక­డలు

ఆరె­స్సెస్‌ అజెండా అమ­లుకు యత్నం

ఆ దిశ­గానే విపక్ష నేత­లపై అరా­చ­కాలు!

అప్పు­డె­ప్పుడో 1990లో ఆంధ్రా­కింగ్‌ చిరం­జీవి హీరోగా, బాంబే క్వీన్‌ శ్రీదేవి హీరో­యి­న్‌గా వచ్చిన జగ­దేక వీరుడు అతి­లోక సుందరి సినిమా కథ గుర్తుందా? ఆ సిని­మాలో అమ్రి­ష్‌­పురి మహా­ద్రష్ట అనే మాంత్రి­కుడి పాత్ర పోషిం­చారు! ఆ మాంత్రి­కుడి లక్ష్యం.. ‘నిత్య యవ్వనం.. త్రిలో­కా­ధి­పత్యం’. అందు­కోసం ఒక దేవ కన్య సహా ఐదు­గురు ఉత్త­మ­జాతి కన్య­లను అగ్నికి ఆహుతి చేసేం­దుకు సిద్ధ­ప­డ­తాడు. అందు­కోసం కన్నడ ప్రభా­కర్‌, రామి­రెడ్డి, తని­కెళ్ల భరణి వంటి వారు పోషిం­చిన పాత్రలు సహ­క­రిం­చేం­దుకు పని­చే­స్తాయి. కానీ.. ఆ ప్రయ­త్నాలు సత్తా ఉన్న రాజు అనే యువ­కుడి ముందు విఫ­ల­మ­వు­తాయి! ఇదే సినిమా కథను ఇప్పుడు వర్త­మాన రాజ­కీ­యా­లకు వర్తిం­ప­జే­యొ­చ్చని అంటు­న్నారు విశ్లే­ష­కులు! సుదీ­ర్ఘ­కాలం అధి­కా­రంలో కొన­సా­గేం­దుకు, తన పార్టీ తప్ప రాజ­కీయ యవ­ని­కపై మరో పార్టీ లేకుండా చేసేం­దుకు.. అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ­లైన ఈడీ, సీబీఐ, ఐటీ వంటి­వా­టిని యథే­చ్ఛగా వాడు­కు­నేం­దుకు చేసిన, చేస్తున్న ప్రయ­త్నాలు ఇందుకు నిద­ర్శ­నంగా నిలు­స్తు­న్నా­యని చెబు­తు­న్నారు. 

న్యూఢిల్లీ : 1951-1952 మొదటి ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ విధా­నాన్ని ఆచ­ర­ణలో అమలు చేయా­లని ప్రధాని మోదీ ఎందుకు ఉబ­లా­ట­ప­డు­తు­న్నారు? మాజీ రాష్ట్ర­పతి రాంనాథ్‌ కోవింద్‌ నేతృ­త్వంలో ఒకే దేశం.. ఒకే ఎన్ని­కపై అధ్య­యనం చేయించి, సిఫా­ర్సులు స్వీక­రిం­చడం వెనుక అసలు ఉద్దే­శా­లేంటి? వాటికి.. కేంద్ర దర్యాప్తు సంస్థ­లను ఉప­యో­గించి, ప్రతి­పక్ష పార్టీల నేత­లను లోపలే ఉంచేం­దుకు చేస్తున్న ప్రయ­త్నా­లకు లింకు ఉన్నదా? లోతుగా గమనిస్తే భారీ కుట్రలో భాగంగానే ఈ పరిణామాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన లక్ష్యం కోసం ప్రధానంగా ఎన్డీయే కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను మోదీ లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. తాము అధికారంలో లేని చోట తమ మాట నెగ్గాలంటే.. అక్కడ తన ప్రభుత్వం అయినా ఉండాలి లేదా తన తైనాతీ ప్రభుత్వమైన కొలువుదీరాలి! కొన్నేళ్లగా గమనిస్తే అనేక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు కూలిపోవడం వెనుక లింకులు.. ఒక్కొక్కటి కనెక్ట్‌ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో బీహార్‌లో నితీశ్‌ను తనవైపు తిప్పుకొన్న బీజేపీ.. తదుపరి జార్ఖండ్‌పై కన్నేసి, అవినీతి ఆరోపణలపై హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేయించడం ద్వారా రాజకీయ అస్థిరతను సృష్టించాలని, తద్వారా తాను ప్రభుత్వంలో దూరాలని ప్రయత్నం చేసింది. అయితే.. ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా అక్క­డితో ఆగ­లేదు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా అధి­నేత శిబు­సొ­రేన్‌ పెద్ద కోడలు సీతా సొరేన్‌ లోక్‌­సభ ఎన్ని­కల వేళ పార్టీని వీడి కాషాయ కండువా కప్పు­కొ­న్నారు. మనీ లాండ­రింగ్‌ కేసులో అరె­స్టైన హేమంత్‌ సొరేన్‌ స్థానంలో ఆయన సతీ­మణి కల్ప­నాకు పాలనా పగ్గాలు అప్ప­గి­స్తా­రని ప్రచారం జరి­గింది. దీన్ని సీతా సోరెన్‌ బహి­రం­గం­గానే వ్యతి­రే­కిం­చారు. ఇది అప్పట్లో చర్చ­నీ­యాం­శ­మైంది. ఎన్ని­కల తర్వాత జార్ఖం­డ్‌లో అధి­కార మార్పి­డికి బీజేపీ చేసే ప్రయ­త్నా­లకు సీతా సొరే­న్‌ను పావుగా మార్చు­కుం­టా­రనే అభి­ప్రా­యాలు వ్యక్త­మ­వు­తు­న్నాయి. అలాగే కర్ణా­టక ఎన్ని­కల ఫలి­తాల రోజు బీజేపీ నేతలు తమకు మెజా­రిటీ రాక­పోతే జేడీ­ఎ­స్‌తో కలిసి ప్రభు­త్వాన్ని ఏర్పాటు చేస్తా­మ­న్నారు. కానీ కన్నడ ప్రజలు కాషాయ నేతల ఆశ­లపై నీళ్లు చల్లారు. కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజా­రిటీ కట్ట­బె­ట్టారు. దీంతో కంగు­తిన్న బీజేపీ నేతలు లోక్‌­సభ ఎన్ని­కల అనం­తరం కర్ణా­ట­కలో బీజేపీ ప్రభుత్వం ఏర్ప­డు­తుం­దని వ్యాఖ్యా­నిం­చారు. ఆ వ్యాఖ్య­లకు బలం చేకూ­ర్చేలా ఎన్ని­కల తర్వాత జేడీ­ఎస్‌ ఎన్డీ­ఏలో కలి­సింది. లోక్‌­సభ ఎన్ని­కల్లో రెండు పార్టీలు కలిసి పోటీ­చే­య­బో­తు­న్నాయి. తెలం­గా­ణ­లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్ప­డిన తర్వాత బీఆ­ర్‌­ఎస్‌, బీజేపీ నేతలు ఆ ప్రభుత్వ మను­గ­డపై కొన్ని వివా­దా­స్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత బీఆ­ర్‌­ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభు­త్వాన్ని కూల్చా­ల్సిన అవ­సరం మాకు లేదని, ఆ పార్టీ నేతలే దానికి బీజం వేస్తా­రని అంటు­న్నారు. గతంలో కర్ణా­టక, మధ్య­ప్ర­దేశ్‌ రాష్ట్ర ప్రభు­త్వాలు కూలి­పో­వ­డా­నికి ఆ పార్టీ నేతలే కార­ణ­మని గుర్తు­చే­స్తు­న్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం సార్వ­త్రిక ఎన్ని­కల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలి­పో­తుం­దని జోస్యం చెబు­తు­న్నారు. ఈ నేప­థ్యం­లోనే సీఎం రేవం­త్‌­రెడ్డి బీఆ­ర్‌­ఎస్‌, బీజేపీ నేతల వ్యాఖ్య­లపై ధ్వజ­మె­త్తారు. అలాంటి ప్రయ­త్నా­లకు అడ్డు­కట్ట వేయ­డా­నికే పీసీసీ అధ్య­క్షు­డిగా తన రాజ­కీయం చూపె­డు­తా­నని అన్నట్లే గేట్లు తెరి­చా­రని రాజ­కీయ విశ్లే­ష­కులు అభి­ప్రా­య­ప­డు­తు­న్నారు. 

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!

ఢిల్లీ సీఎం అర­వింద్‌ కేజ్రీ­వా­ల్‌ను మద్యం కుంభ­కో­ణంలో ఈడీ అరెస్టు చేసింది. ఇప్పుడు అక్కడ ప్రభు­త్వాన్ని ఎవరు నడు­పు­తారు? అనే సందే­హాలు వ్యక్త­మౌ­తు­న్నాయి. తమ అధి­నేత జైలు నుంచే పాలన సాగి­స్తా­రని ఆప్‌ నేతలు అంటున్నారు. ప్రజా­ప్రా­తి­నిధ్య చట్టం 1951 ప్రకారం ప్రజా­ప్ర­తి­ని­ధిగా ఎన్ని­కైన వ్యక్తి దోషిగా తేలే­వ­రకు రాజీ­నామా చేయా­ల్సిన అవ­సరం లేని న్యాయ­ని­పు­ణులు చెబు­తు­న్నారు. కానీ జైలు నుంచే సమీ­క్షలు, మంత్రి­వర్గ సమా­వే­శాలు నిర్వ­హిం­చడం ప్రాక్టి­క­ల్‌గా సాధ్యం కాదం­టు­న్నారు. దీన్ని­కా­ర­ణంగా చూపెట్టి కేంద్రం అక్కడ రాష్ట్ర­పతి పాలన విధించే అవ­కా­శా­లు­న్నాయని అంచనా వేస్తున్నారు. అంటే.. వీలుంటే ఎన్నికల్లోపే ఢిల్లీలో రాష్ట్రపతిపాలన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఎన్ని­కల ముందు మద్యం కేసులో ఈడీ దూకు­డుగా వ్యవ­హ­రిం­చడం వెనుక కేంద్రం ఉన్న­దనే విమ­ర్శ­లు­న్నాయి. ఇండియా కూట­మిని కకావికలం చేయడమే దాని ఉద్దేశంగా కనిపిస్తున్నది రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా పంజా­బ్‌లో పాత మిత్రుడు అకా­లీ­దళ్‌ తిరిగి ఎన్డీ­ఏలో చేర­ను­న్న­దని సమా­చారం. ‘కేజ్రీ­వాల్‌ బైట ఉంటే పంజాబ్‌, ఢిల్లీ, ఉత్త­రా­ఖండ్‌, గుజ­రాత్‌ వంటి రాష్ట్రాల్లో బీజే­పీకి నష్టం జరు­గు­తుం­దని మోడీ, షా ఆందో­ళన చెందు­తు­న్నారు. అందుకే విపక్ష నేతలు ముఖ్యంగా బీజేపీ హవాకు అడ్డు­కట్ట వేస్తున్న ప్రాంతీ­య­పా­ర్టీ­లనే టార్గె­ట్‌­చే­సి­నట్టు కని­పి­స్తు­న్నది’ అని ఒక విశ్లే­ష­కుడు అన్నారు. బీజేపీ, ఆర్‌­ఎ­స్‌­ఎస్‌ అజెం­డాలో భాగంగా రాజ్యాం­గాన్ని మార్చా­లనే తమ ఆలో­చ­నలు అమలు కావా­లంటే దానికి అవ­స­ర­మైన చర్యలు తీసు­కో­వ­డంలో భాగమే ఈ పరి­ణా­మాలు అంటు­న్నారు. అధి­కా­రంలో ఉండటం మాత్రమే కాదు అధి­కా­రంలో స్థిర­ప­డా­లనే కోరిక నరేం­ద్ర­మో­దీలో ఉన్న­దని చెబు­తు­న్నారు. అందుకే దాన్ని ఆచ­ర­ణలో పెట్టా­ల­ను­కుం­టు­న్నారు. ఈ క్రమంలోనే తన కార్యాచరణకు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి స్వతంత్ర ప్రతిపత్తికలిగిన సంస్థలను కూడా యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. 

మత అజెండా గట్టెక్కించడంపై అనుమానాలు!

సార్వ­త్రిక ఎన్ని­కల ముందు రామ మందిరం నిర్మాణం, ఆర్టి­కల్‌ 370, సీఏఏ వంటి అంశాలే బీజే­పీని గెలు­పు­తీ­రా­లకు తీసు­కె­ళ్ల­లే­వన్న ఆందో­ళన కాషా­య­పార్టీ నేతల్లోనూ కనిపిస్తున్నది. అందుకే ప్రతిపక్షాలను టోకుగా కట్టడి చేసే చర్యలకు పాల్పడుతున్నదని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపజేసినా, కేజ్రీవాల్‌ను ఇప్పుడు, ఆ పార్టీకి చెందిన కీలక నేతలను గతంలోనే అరెస్టు చేయించినా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు లేకుండా చూసుకోవడమే మోదీ లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. ఇదంతా మోదీ దీర్ఘకాలిక లక్ష్యంలో భాగమేనని స్పష్టం చేస్తున్నారు.