BJP | వాయిదా పడిన బండి సంజయ్ సభ..! రాజగోపాల్ రెడ్డి అభ్యంతరంతోనేనా!
విధాత: నల్లగొండలో ఈనెల 26న తలపెట్టిన బండి సంజయ్ సభ వాయిదా పడింది. వర్షాలు పడే అవకాశం ఉన్నందున సభను వాయిదా వేసినట్లుగా బిజెపి (BJP) వర్గాలు వెల్లడించాయి. నిజానికి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముందస్తు సమాచారం లేకుండా బండి సంజయ్ సభను ఖరారు చేశారని, ఆరోజు తాను అందుబాటులో ఉండనందునా సభను వాయిదా వేయాలన్న ఆయన డిమాండ్ నేపథ్యంలో సభ వాయిదా పడినట్లు తెలుస్తుంది. తన జిల్లాలో […]

విధాత: నల్లగొండలో ఈనెల 26న తలపెట్టిన బండి సంజయ్ సభ వాయిదా పడింది. వర్షాలు పడే అవకాశం ఉన్నందున సభను వాయిదా వేసినట్లుగా బిజెపి (BJP) వర్గాలు వెల్లడించాయి. నిజానికి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముందస్తు సమాచారం లేకుండా బండి సంజయ్ సభను ఖరారు చేశారని, ఆరోజు తాను అందుబాటులో ఉండనందునా సభను వాయిదా వేయాలన్న ఆయన డిమాండ్ నేపథ్యంలో సభ వాయిదా పడినట్లు తెలుస్తుంది.
తన జిల్లాలో తాను లేకుండా బండి సంజయ్ సభ ఏమిటంటు రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరంతో బండి సభ వాయిదా పడినట్లు బిజెపి వర్గాల్లో చర్చ వినిపిస్తుంది. ఇప్పటికే బిజెపిలో ఇమడ లేక, BRSకు దగ్గరవుతున్న ఆ పార్టీ వైఖరిని జీర్ణించుకోలేక అసంతృప్తితో రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ప్రచారం నెలకొంది.
ఈ క్రమంలో BJP అధిష్టానం ఈటెల, రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలవడంతో ఆయన నల్లగొండ సభకు అందుబాటులో ఉండే అవకాశం లేదని అందుకే సంజయ్ సభ వాయిదాకు పార్టీ నిర్ణయించినట్లు సమాచారం