దక్షిణాన బీజేపీ ఆటలు సాగవు: మంత్రి గంగుల
విధాత: ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా..సమైక్య పాలన ఇదివరకే చూశాం. మళ్లీ మీ పాలన అవసరం లేదన్నారు. పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వాళ్లు తెలంగాణకు వస్తున్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు? అని మంత్రి గంగుల ప్రశ్నించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషయం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదన్నారు. రాష్ట్రంలో 24 గంటల తాగునీరే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తొమ్మిదేళ్లలో కరీంనగర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశాం. పర్యాటకుల కోసం కేబుల్ […]

విధాత: ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా..సమైక్య పాలన ఇదివరకే చూశాం. మళ్లీ మీ పాలన అవసరం లేదన్నారు. పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వాళ్లు తెలంగాణకు వస్తున్నారు. ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు? అని మంత్రి గంగుల ప్రశ్నించారు.
ఢిల్లీ పాలకులు ఎంత విషయం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదన్నారు. రాష్ట్రంలో 24 గంటల తాగునీరే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తొమ్మిదేళ్లలో కరీంనగర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశాం. పర్యాటకుల కోసం కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేశామన్నారు.
ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతగా మాట్లాడటం బాధాకరం. ఆయన అభివృద్ధి గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడి వెళ్లిపోయారు. దక్షిణభారత దేశంలో బీజేపీ ఆటలు సాగవని మంత్రి స్పష్టం చేశారు.