BRSతోనే బీజేపీ ప్రభుత్వ పతనం: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల వ్యతిరేక విధానాల అనుసరిస్తూ వారి ఉసురుతీస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీకి కేసీఆర్ భయం పట్టుకుందని, కేసీఆర్‌ని నిలువరించడమే మోడీ పనిగా పెట్టుకున్నడన్నారు. గుజరాత్‌లో అన్నదాతలు కేసీఆర్ గురించి గొప్పగా చర్చించుకుంటున్నారని, మోడీని ఎక్కడికక్కడ అన్నదాతలు నిలదీస్తున్నారన్నారు. […]

  • By: Somu    latest    Feb 20, 2023 10:57 AM IST
BRSతోనే బీజేపీ ప్రభుత్వ పతనం: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల వ్యతిరేక విధానాల అనుసరిస్తూ వారి ఉసురుతీస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు.

ప్రధాని మోడీకి కేసీఆర్ భయం పట్టుకుందని, కేసీఆర్‌ని నిలువరించడమే మోడీ పనిగా పెట్టుకున్నడన్నారు. గుజరాత్‌లో అన్నదాతలు కేసీఆర్ గురించి గొప్పగా చర్చించుకుంటున్నారని, మోడీని ఎక్కడికక్కడ అన్నదాతలు నిలదీస్తున్నారన్నారు.

2014కు ముందు తెలంగాణలో వ్యవసాయ రంగం అగమ్యగోచరంగా ఉందని, ఇపుడు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా రైతులకు ఇప్పటికి 7 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదన్నారు.

గుజరాత్‌లో వ్యవసాయ మోటర్లకు మోటర్లు పెట్టిన ఘనుడు మోడీ అని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ పార్టీ ద్వంద విధానాలను ఎండ గట్టారని కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వం పతనం బీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం విధానాలపై చేస్తున్న విమర్శలకు సూటిగా సమాధానాలు చెప్పలేని కేంద్ర మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణలో కరెంట్ కోతలు తెచ్చేలా మోడీ అండ్ గ్యాంగ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్న మోడీ అండ్ గ్యాంగ్ దుర్మార్గాలపై
ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలని, కేసీఆర్‌ను విమర్శించే బీజేపీ నాయకులను రానున్న రోజుల్లో తరిమి కొట్టాలన్నారు.

ఆదానీ కోసం పని చేస్తున్న మోడీ సర్కార్‌కు కాలం చెల్లిపోయిందని, ప్రజల సొమ్మును దోచుకుతిన్న మోడీ, ఆదానీలకు రైతులు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలంగాణ వ్యవసాయ విధానాన్ని, ఇరిగేషన్‌ను మెచ్చుకున్నారన్నారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్త్వం మాత్రమే అన్నారు.

కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ మంకెన కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, ఎన్. భాస్కర్ రావు, కార్పొరేషన్ చైర్మన్ లు విజయ సింహ రెడ్డి, బాలరాజ్ యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆర్. మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.