BJP | 119 నియోజకవర్గాల్లో ‘పొరుగు’ బీజేపి ఎమ్మెల్యేల పర్యటన
BJP ఈనెల 20 నుంచి వారం రోజులపాటు నియోజకవర్గాలలోనే.. విధాత: తెలంగాణలో బిజెపి పార్టీ బలోపేతం దిశగా పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీ నుంచి వారం రోజులపాటు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, యుపి రాష్ట్రాలకు చెందిన బీజేపి ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. వారు నియోజకవర్గాల్లోనే వారం రోజుల పాటు బస చేసి పార్టీ బలాబలాలు, అభ్యర్థుల వివరాలపై నివేదికలు రూపొందించి పార్టీ అధిష్టానానికి అందించనున్నారు. అటు […]

BJP
- ఈనెల 20 నుంచి వారం రోజులపాటు నియోజకవర్గాలలోనే..
విధాత: తెలంగాణలో బిజెపి పార్టీ బలోపేతం దిశగా పార్టీ జాతీయ నాయకత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీ నుంచి వారం రోజులపాటు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, యుపి రాష్ట్రాలకు చెందిన బీజేపి ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
వారు నియోజకవర్గాల్లోనే వారం రోజుల పాటు బస చేసి పార్టీ బలాబలాలు, అభ్యర్థుల వివరాలపై నివేదికలు రూపొందించి పార్టీ అధిష్టానానికి అందించనున్నారు.
అటు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈనెల 6న నల్గొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాప్యాన్ని నిరసిస్తూ నిర్వహించే నిరసన ర్యాలీ, సభలో పాల్గొననున్నారు.