BJP | రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది?: బండి సంజయ్

BJP ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలేదు.. కాంగ్రెస్ కిరాణ దుకాణంలో కాస్ట్‌లీ మెటీరియల్ చేరిక కేసీఆర్ డబ్బుతో కాంగ్రెస్‌ను కొన్నారు బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు BRS గడీల పాలన అంతమొందిద్దాం 8 న జరిగే సభకు విజయ సంకల్ప సభగా పేరు బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యాడుంది? ఆ పార్టీని జాకీ పెట్టి లేపాలని చూస్తున్నరు. దుబ్బాక సహా మునుగోడు […]

BJP | రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది?: బండి సంజయ్

BJP

  • ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలేదు..
  • కాంగ్రెస్ కిరాణ దుకాణంలో కాస్ట్‌లీ మెటీరియల్ చేరిక
  • కేసీఆర్ డబ్బుతో కాంగ్రెస్‌ను కొన్నారు
  • బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు
  • BRS గడీల పాలన అంతమొందిద్దాం
  • 8 న జరిగే సభకు విజయ సంకల్ప సభగా పేరు
  • బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యాడుంది? ఆ పార్టీని జాకీ పెట్టి లేపాలని చూస్తున్నరు. దుబ్బాక సహా మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

ఈనెల 8న ప్రధాని హాజరయ్యే విజయ సంకల్ప సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం హనుమకొండలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.

కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు

దుబ్బాక, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పై పోటీ చేసి గెలిచింది బీజేపీయేనని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. అందుకే బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ లు కుమ్మక్కై కుట్ర చేస్తూ తమను అప్రతిష్ట పాల్జేస్తున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే. బీఆర్ఎస్ గడీల పాలనను అంతమొందించి రామరాజ్య స్థాపనే బీజేపీ ఏకైక లక్ష్యం.

కెసిఆర్ దృష్టిలో కాంగ్రెస్ షాపింగ్ మాల్

కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిది. కేసీఆర్ దృష్టిలో ఆ పార్టీ అంటేనే షాపింగ్ మాల్ లాంటిందని బండి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పార్టీలో మరో కాస్ట్ లీ మెటీరియల్ వచ్చి చేరింది.
కేసీఆర్ దగ్గర డబ్బులకు కొదవలేదు. ఎంత డబ్బైనా పెట్టి కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.

ఈ సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 8న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే ‘విజయ సంకల్ప సభ’’ ఉదయం 9 గంటలకే జరుగుతుంది. 15 లక్షల జన సమీకరణతో సభను నిర్వహించి ఓరుగల్లును పోరుగల్లుగా మార్చి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు.

కనివీనీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌ ప్రసంగిస్తూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రతిష్ట మసక బారిందన్నారు. రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

సమావేశంలో బిజెపి నాయకులు గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.