బీజేపీకి అందిన విరాళాలు రూ. 614.53 కోట్లు
విధాత: విరాళాలు పొందటంలో బీజేపీ మిగతా పార్టీలకు అందనంత దూరంలో ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన విరాళాలు మొత్తం రూ. 614.53 కోట్లు. వందేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు రూ. 95.46 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.44.54 కోట్లు రాగా, సీపీఎం పార్టీకి రూ.10 కోట్లు అందాయి. దేశంలో ఉన్న మిగతా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నింటిని కలిపినా బీజేపీకి వచ్చిన దాంట్లో నాలుగో వంతు లేక పోవటం గమనార్హం. కాంగ్రెస్ కన్నా […]

విధాత: విరాళాలు పొందటంలో బీజేపీ మిగతా పార్టీలకు అందనంత దూరంలో ఉన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన విరాళాలు మొత్తం రూ. 614.53 కోట్లు. వందేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు రూ. 95.46 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.44.54 కోట్లు రాగా, సీపీఎం పార్టీకి రూ.10 కోట్లు అందాయి.
దేశంలో ఉన్న మిగతా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నింటిని కలిపినా బీజేపీకి వచ్చిన దాంట్లో నాలుగో వంతు లేక పోవటం గమనార్హం. కాంగ్రెస్ కన్నా బీజీపీకి అందిన విరాళాలు ఆరు రెట్లు ఎక్కువ.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రూ. 20వేల కన్నా ఎక్కువ విరాళం ఇచ్చిన సంస్థల, వ్యక్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించాలి. అయితే.. ఎవరికీ ఇవ్వని స్థాయిలో బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు బహిర్గతం చేస్తారా? దీంతో విరాళాలు ఎవరు ఎంత ఇచ్చారు, వారి లోగుట్టు ఏమిటో తేట తెల్లమయ్యే అవకాశం ఉన్నది.