ముఠామేస్త్రి, అందరివాడుతో కానిది.. బాబీ చేసి చూపాడు!

Waltair Veerayya విధాత‌: దర్శకుడు అంటే ఏ ఏ హీరోలకు ఎలాంటి చిత్రాలు కరెక్టుగా సెట్ అవుతాయి? ఎలాంటి పాత్రలకు వారు సూట్ అవుతారు? అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎలాంటి కథ అయితే సూట్ అవుతుందో ప్రేక్షకులు ఆయా హీరోలను ఎలా చూడాలని భావిస్తున్నారో అలా చూపిస్తేనే ఆ హీరోలు ఇచ్చిన ఛాన్స్ ను కొత్త దర్శకులు అందిపుచ్చుకుంటారు. అంతేగాని కొత్తగా డిజైన్ చేసినంత మాత్రాన నేల విడిచి సాము చేస్తే అది మొదటికే […]

  • By: krs    latest    Jan 30, 2023 5:02 AM IST
ముఠామేస్త్రి, అందరివాడుతో కానిది.. బాబీ చేసి చూపాడు!

Waltair Veerayya

విధాత‌: దర్శకుడు అంటే ఏ ఏ హీరోలకు ఎలాంటి చిత్రాలు కరెక్టుగా సెట్ అవుతాయి? ఎలాంటి పాత్రలకు వారు సూట్ అవుతారు? అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎలాంటి కథ అయితే సూట్ అవుతుందో ప్రేక్షకులు ఆయా హీరోలను ఎలా చూడాలని భావిస్తున్నారో అలా చూపిస్తేనే ఆ హీరోలు ఇచ్చిన ఛాన్స్ ను కొత్త దర్శకులు అందిపుచ్చుకుంటారు.

అంతేగాని కొత్తగా డిజైన్ చేసినంత మాత్రాన నేల విడిచి సాము చేస్తే అది మొదటికే మోసం అవుతుంది. ఇచ్చిన‌ అవకాశం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక చిరు ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్‌లో చూపిస్తూ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని లుక్స్‌ పరంగా, నటనా పరంగా మెప్పించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.

ముఠామేస్త్రి చిత్రాన్ని కోదండరామిరెడ్డి తీశారు. ఇందులో ముఠామేస్త్రి క్యారెక్టర్ పేలింది కానీ సినిమా పెద్దగా పేలలేదు. ఇక అంద‌రివాడు చిత్రం అయితే చిరులోని మేకోవ‌ర్, వింటేజ్ లుక్‌ని నమ్ముకుని శ్రీను వైట్ల నేల విడిచి సాము చేశారు. అందరివాడు చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీలోని గోవిందు క్యారెక్టర్‌లో చిరు అదరగొట్టారు. డైలాగ్ డెలివరీ, మేనరిజం, సాంగ్స్ అన్నింటిలోనూ త‌న స‌త్తా చూపించారు. కానీ చిరు క్యారెక్టర్ హిట్ అయిందే గాని సినిమా హిట్ కాలేదు. దాంతో అందరివాడు కాస్త కొందరి వాడిగానే మిగిలిపోయింది.

ఇన్నాళ్లకు మళ్లీ ఆయా సినిమాల్లోని వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాబీ తీసిన మూవీ వాల్తేరు వీరయ్య. ఇందులో చిరు క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు ముఠామేస్త్రి, అందరివాడు సినిమాలను గుర్తుకు చేసేలా ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మిస్సయిన అంశాలను మరింత బలంగా జోడించి బాబి వాల్తేరు వీరయ్య తెరకెక్కించారు.

సంక్రాంతి బరిలో విజేతగా నిలిపి జేజేలు అందిస్తున్నాడు. వింటేజ్ చిరుని ఇంత పర్ఫెక్ట్ గా ఇప్పటివరకు కొత్త దర్శకుడు ఎవరు ప్రజెంట్ చేయలేదనేది వాస్తవం. ఆచార్య, గాడ్ ఫాదర్ ల తర్వాత విసిగిపోయిన ఫ్యాన్స్ కి బాబి పూనకాలు తెప్పించాడు. ఈ చిత్రం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మార్కుకు చేరుకోవడాన్ని బట్టి ఈ మూవీని బాబి ఎలా తీశాడు? అనే విషయం అర్థం అవుతోంది.

బాబీ ఈ స్థాయిలో చిరుకి తన పూర్వవైభవాన్ని తీసుకువచ్చేలా వాల్తేరు వీర‌య్య‌ని తీశాడు. శ్రీను వైట్ల ఎంచుకున్న గోవిందు పాత్రని ఫాలో అవుతూ దానికి త‌న‌దైన శైలిని అద్ది చిరు వీరయ్య పాత్రను ఆయ‌న మ‌లిచిన తీరు, ఆయ‌న పాత్ర‌ను కాస్త వైవిధ్యంగా చూపించిన ప‌ద్ద‌తి, చూపిన విధానం, క‌థ‌నాన్ని చ‌క్క‌గా చూపిస్తూ ఏమాత్రం నేల విడిచి సాము చేయ‌కుండా చిరు స్టైల్ ని ఫాలో అవుతూ అద్భుతంగా తెర‌కెక్కించారు.

అదే ఇప్పుడు వాల్తేరు వీరయ్యకు కాసుల వర్షం కురిపిస్తుంది.ఫైనల్ గా ఓ అభిమానిగా చిరుని తాను ఎలా చూడాలనుకున్నాడో అలాగే బాబీ వెండితెరపై ఆవిష్కరించి తనకు చిరు ఇచ్చిన చాన్స్ ని వందకి 100% సద్వినియోగం చేసుకొని అదరగొట్టాడని చెప్పక తప్పదు.