Parineeti Chopra-Raghav Chadha | రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో పరిణీతి చోప్రా-రాఘవ్‌ చద్దాల వివాహ వేడుక.. హోటల్‌ ఒక్కో గది అద్దెంతో తెలిస్తే షాకవుతారు..!

Parineeti Chopra-Raghav Chadha | బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లిపీటలెక్కనున్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్‌ చద్దాను మానువాడనున్నది. గత కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉన్న ఇద్దరు.. త్వరలోనే వివాహబంధంతో ఒక్కటికాబోతున్నది. ఈ జంట ఇప్పటికే ఢిల్లీలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీటౌన్‌లో ఈ పెళ్లి గురించే చర్చ నడుస్తున్నది. వాస్తవానికి సెలబ్రిటీల ఇంట్లో వివాహ వేడుక అంటే మామూలుగా ఉండదు. మరి బాలీవుడ్‌లో అయితే ఓ రేంజ్‌లో ఉంటుంది. వీరి […]

Parineeti Chopra-Raghav Chadha | రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో పరిణీతి చోప్రా-రాఘవ్‌ చద్దాల వివాహ వేడుక.. హోటల్‌ ఒక్కో గది అద్దెంతో తెలిస్తే షాకవుతారు..!

Parineeti Chopra-Raghav Chadha |

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లిపీటలెక్కనున్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్‌ చద్దాను మానువాడనున్నది. గత కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉన్న ఇద్దరు.. త్వరలోనే వివాహబంధంతో ఒక్కటికాబోతున్నది. ఈ జంట ఇప్పటికే ఢిల్లీలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం బీటౌన్‌లో ఈ పెళ్లి గురించే చర్చ నడుస్తున్నది. వాస్తవానికి సెలబ్రిటీల ఇంట్లో వివాహ వేడుక అంటే మామూలుగా ఉండదు. మరి బాలీవుడ్‌లో అయితే ఓ రేంజ్‌లో ఉంటుంది. వీరి పెళ్లి సైతం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో జరుగనున్నది. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

పెళ్లికి 200 మంది అతిథులు హాజరుకానుండగా.. 50 మందికిపైగా వీవీఐపీలు హాజరుకానున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో పరిణీతి చోప్రా – రాఘవ్‌ చద్దాల వివాహం వేడుకలు జరుగనుండగా.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ ముస్తాబవుతున్నది.

మెహందీ, సంగీత్‌, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్‌, ది ఒబెరాయ్‌ ఉదయ్‌ విలాస్‌లు సిద్ధమవుతున్నాయి. అయితే, ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ హోటల్‌ గది అద్దె రోజుకు అత్యధికంగా రూ.9లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. పరిణీతి-రాఘవ్‌ జంట పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నది.

హాలీవుడ్‌ నటి, పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనాస్‌ హాజరుకానున్నారు. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరవనున్నారు. పెళ్లి అనంతరం గురుగ్రామ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ బాష్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.