శ్రీదేవిది స‌హ‌జ మర‌ణం కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బోనీ క‌పూర్

  • By: sn    latest    Oct 03, 2023 2:07 AM IST
శ్రీదేవిది స‌హ‌జ మర‌ణం కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బోనీ క‌పూర్

అతిలోక సుందరి శ్రీదేవి మ‌ర‌ణించి దాదాపు ఐదేళ్లు అవుతుంది. ఆమె హ‌ఠాన్మ‌రణం ఎంతో మందిని క‌లిచివేసింది. శ్రీదేవి లేర‌నే విష‌యాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. శ్రీదేవి మ‌ర‌ణించిన కూడా ఆమె త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంది. అయితే శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణంపై అంద‌రిలో అనేక అనుమానాలు ఉండ‌గా, ఇన్నాళ్ల‌కి బోని క‌పూర్ శ్రీదేవి మ‌ర‌ణంపై తొలిసారి స్పందించారు.



గ‌తంలో శ్రీదేవి మ‌ర‌ణానికి బోనీ క‌పూర్ కార‌ణం అని కూడా కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలో కూడా బోనీ ఏ మాత్రం స్పందించ‌లేదు. అయితే శ్రీదేవి మ‌ర‌ణం మిస్ట‌రీగా ఉండ‌గా, తొలిసారి త‌న భార్య మ‌ర‌ణంపై బోని స్పందించారు.



శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటో ఓ ఇంటర్వ్యూలో బోని క‌పూర్ బ‌య‌ట‌పెట్టారు. శ్రీదేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, అది ప్ర‌మాద‌వ‌శాత్తు చోటు చేసుకుంద‌ని తెలియ‌జేసిన బోని ఒక ర‌హ‌స్యం కూడా బ‌య‌ట‌పెట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అతిలోక‌సుందరిగా అంద‌రితో పిలిపించుకుంటున్న శ్రీదేవి అందానికి ముగ్ధులు కాని వారు లేరు.



అయితే ఆమె అందంగా క‌నిపించ‌డం కోసం క‌ఠిన‌మైన డైట్ ఫాలో అయ్యేద‌ని బోని పేర్కొన్నారు. పెళ్లి త‌ర్వాత త‌ను బాగా స్ట్రిక్ట్ డైట్ తీసుకుంటుంద‌ని నాకు అర్ధమైంది. పూర్తిగా ఉప్పు లేకుండా ఆమె భోజ‌నం చేసేద‌ని, దాని వ‌లన చాలా సార్లు నీర‌సానికి కూడా గుర‌యింద‌ని బోని చెప్పారు. బీపీలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం వ‌ల‌న కొన్ని సార్లు క‌ళ్లు తిరిగి ప‌డిపోయింద‌ని కూడా బోని స్ప‌ష్టం చేశారు.



ఆమె ఆరోగ్యం విష‌యంలో డాక్ట‌ర్స్ ప‌లు మార్లు హెచ్చ‌రించిన కూడా త‌ను సీరియ‌స్ గా తీసుకోలేద‌ని అన్నారు. ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిలేద‌ని చెప్పిన బోని క‌పూర్‌.. భార‌త మీడియా ఒత్తిడి వ‌ల‌న దుబాయ్ పోలీసులు త‌న‌ని విచారించార‌ని, లై డిటెక్టర్‌ టెస్ట్ కూడా చేశారని, తనని పోలీసులు అన్ని విధాలుగా పరీక్షించినట్టు చెప్పుకొచ్చారు బోని క‌పూర్.



అయితే శ్రీదేవి చ‌నిపోయిన త‌ర్వాత ఓ సారి నాగార్జున న‌న్ను క‌లిసి.. తాను గ‌తంలో కూడా ఇలా డైట్ పాటించ‌డం వ‌ల‌న సినిమా సెట్స్ లో క‌ళ్లు తిరిగి కింద ప‌డింద‌ని, అప్పుడు చిన్న‌పాటి గాయాలు కూడా అయ్యాయ‌ని నాగ్ త‌న‌కు చెప్పిన‌ట్టు బోని స్ప‌ష్టం చేశాడు.