javelin | జావెలిన్.. తలకు తగిలి విద్యార్థి మృతి
javelin | షూలేస్ కట్టుకోవడానికి వంగగా తలిగిన ఈటె పాఠశాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా దుర్ఘటన విధాత: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. పాఠశాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా, జావెలిన్ (ఈటె) తలకు గుచ్చుకోవడంతో విద్యార్థి మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగావ్ తాలూకా గోరేగావ్ పురార్‌లోని ఐఎన్‌టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జావెలిన్ టీమ్‌లో చురుకైన సభ్యుడైన హుజెఫా దావేర్ రాబోయే తాలూకా స్థాయి మీట్‌కు సిద్ధమవుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల మైదానంలో విద్యార్థులతో […]

javelin |
- షూలేస్ కట్టుకోవడానికి వంగగా తలిగిన ఈటె
- పాఠశాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా దుర్ఘటన
విధాత: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. పాఠశాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా, జావెలిన్ (ఈటె) తలకు గుచ్చుకోవడంతో విద్యార్థి మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగావ్ తాలూకా గోరేగావ్ పురార్‌లోని ఐఎన్‌టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జావెలిన్ టీమ్‌లో చురుకైన సభ్యుడైన హుజెఫా దావేర్ రాబోయే తాలూకా స్థాయి మీట్‌కు సిద్ధమవుతున్నాడు.
బుధవారం మధ్యాహ్నం పాఠశాల మైదానంలో విద్యార్థులతో కలిసి హుజెఫా దావేర్ జావెలిన్ త్రోయింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాడు. అదే మైదానంలో దావరే అనే 15 ఏండ్ల విద్యార్థి తన షూలేస్‌ను కట్టుకోవడానికి కిందికి వంగారు. దావేర్ విసిరిన ఈటె విద్యార్థికి తలకు వెనుక నుంచి గుచ్చుకున్నది.
జావెలిన్ తలకు గుచ్చుకోవడంతో దావరే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్టు అధికారి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు, క్రీడా మైదానాన్ని కవర్ చేస్తున్న దృశ్యాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.