పెళ్లి వేదికపైనే చితకొట్టుకున్న కొత్త జంట!
Newly Married Couple | వివాహ వేదికపై నూతన వధూవరులు కని కనిపించని రొమాన్స్‌లో మునిగి తేలుతుంటారు. ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్త పరుస్తూ.. తమ సంసార జీవితానికి స్వాగతం పలుకుతుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయి. అయితే ఓ జంట పెళ్లి వేదికపైనే చెంపలు వాయించేసుకున్నారు. ఎందుకంటే.. తనకు ఇష్టం లేక పోయినప్పటికీ బలవంతంగా స్వీటు తినిపించాడని వరుడిపై వధువు విరుచుకుపడింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. […]

Newly Married Couple | వివాహ వేదికపై నూతన వధూవరులు కని కనిపించని రొమాన్స్‌లో మునిగి తేలుతుంటారు. ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్త పరుస్తూ.. తమ సంసార జీవితానికి స్వాగతం పలుకుతుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయి.
అయితే ఓ జంట పెళ్లి వేదికపైనే చెంపలు వాయించేసుకున్నారు. ఎందుకంటే.. తనకు ఇష్టం లేక పోయినప్పటికీ బలవంతంగా స్వీటు తినిపించాడని వరుడిపై వధువు విరుచుకుపడింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పెళ్లి వేదికపైనే చితకొట్టుకున్న కొత్త జంట.. ? https://t.co/0ymwLx9M4U pic.twitter.com/PcZ94qUYNl
— vidhaathanews (@vidhaathanews) December 16, 2022
అయితే వరుడు వధువుకు తాళి కట్టిన అనంతరం అతిథుల ఆశీర్వాదాలు తీసుకునేందుకు వేదికపై నిల్చున్నారు. ఈ క్రమంలో నూతన వధూవరులు ఇద్దరూ స్వీట్లు తినిపించుకుంటున్నారు. వరుడు వధువుకు స్వీటు తినిపిస్తుండగా ఆమె తిరస్కరించింది.
అయినప్పటికీ బలవంతంగా తినిపించబోయాడు. తీవ్రంగా చికాకు పడ్డ వధువు వరుడి చెంపపై లాగి కొట్టింది. వరుడు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ఒకరిపై ఒకరు పంచుల వర్షం కురిపించుకున్నారు. ఇక కుటుంబ సభ్యులు ఇద్దర్ని విడిపించి, శాంతిపజేశారు.