మా అక్క చచ్చిపోయిందని పూలదండ తెచ్చారా?: రాజ్‌భవన్ క్లారిటీ

తన అక్కకు సరైన వైద్యం అందడం లేదని ప్రీతి సోదరి ఆరోపణ గవర్నర్‌ తమిళిసై పై ప్రీతి కుటుంబ సభ్యుల ఆగ్రహం ఘటనకు బాధ్యుడైన నిందిడుడిని ఊరి తీయాలని డిమాండ్‌ రాజ్‌భవన్ క్లారిటీ విధాత: నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని పరామర్శించడానికి గవర్నర్‌ తమిళిసై పూలదండతో వెళ్లడంపై ఆమె సోదరి దీప్తి మండిపడ్డారు. దీనిపై ఆమె సోదరి గవర్నర్‌ను ప్రశ్నిస్తూ.. పూల దండ ఎవరికి తెస్తారు? మా అక్క చనిపోయిందని పూల దండ […]

  • By: krs    latest    Feb 25, 2023 1:21 AM IST
మా అక్క చచ్చిపోయిందని పూలదండ తెచ్చారా?: రాజ్‌భవన్ క్లారిటీ
  • తన అక్కకు సరైన వైద్యం అందడం లేదని ప్రీతి సోదరి ఆరోపణ
  • గవర్నర్‌ తమిళిసై పై ప్రీతి కుటుంబ సభ్యుల ఆగ్రహం
  • ఘటనకు బాధ్యుడైన నిందిడుడిని ఊరి తీయాలని డిమాండ్‌
  • రాజ్‌భవన్ క్లారిటీ

విధాత: నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని పరామర్శించడానికి గవర్నర్‌ తమిళిసై పూలదండతో వెళ్లడంపై ఆమె సోదరి దీప్తి మండిపడ్డారు. దీనిపై ఆమె సోదరి గవర్నర్‌ను ప్రశ్నిస్తూ.. పూల దండ ఎవరికి తెస్తారు? మా అక్క చనిపోయిందని పూల దండ తెచ్చారా? .గవర్నర్‌గా మీకు అధికారం ఉన్నది. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీ ఎందుకు వేయలేదని, సమాజాన్ని కాపాడాల్సిన ఒక డాక్టర్‌ చనిపోతుంటే మీరంతా ఏం చేశారని నిలదీశారు.

మా కుటుంబ సభ్యులంతా ఏడుస్తుంటే ఆఫీసర్లు వచ్చి ఏం కాదని అంటున్నారని.. ఇంకా ఏమున్నది మొత్తం అయిపోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు డ్యూటీకి వెళ్లే మా బాబాయి ఎంత దీనస్థితికి వెళ్లి పోయారంటే.. అంతా కోల్పోయాను అనే స్థితిలో ఉన్నారు. కాలేజీ మొత్తం సమస్య ఉన్నదని బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండి ఉంటే గనుక అసలు ఏమైందనే విషయాన్ని ఆరా తీయడానికి ప్రత్యేక కమిటీ ఎందుకు వేయదని ప్రశ్నించారు.

హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌తో సహా అందరికీ కంప్లైంట్‌ ఇచ్చామని, ఒక పీజీ విద్యార్థి పర్మిషన్‌ తీసుకుని ఫాస్ట్‌ రూమ్‌ కు ఎందుకు వెళ్లాళ్లి వచ్చిందని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు సరైన వైద్యం అందడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ పబ్లిసిటీ కోసం మేము వచ్చామని చూపించుకోవడానికి కాదు, దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించడానికి రావొద్దని ఆమె కోరారు. ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడిని ఉరి తీయాలని దీప్తి ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

రాజ్‌భవన్ క్లారిటీ

అయితే నిమ్స్‌కు పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారంపై రాజ్‌భవన్‌ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఓ ప్రకటనను విడుదల చేసింది. కారులో ఉన్న పూలదండ ఖైరతాబాద్‌లోని హనుమంతుని ఆలయంలో సమర్పించేందుకు తీసుకువచ్చినదని స్పష్టం చేశాయి. గవర్నర్‌ బయట ప్రాంతాలకు వెళ్లివచ్చినప్పుడల్లా హనుమంతుడి ఆలయంలో పూలదండ సమర్పించడం అనవాయితీగా వస్తున్నదని అందులో భాగంగానే పూలదండ తీసుకురావడం జరిగిందని దీనిపై దష్ప్రచారం చేయకూడదని పేర్కొన్నాయి.

ప్రీతి ఆరోగ్యం మెరుగు పడుతున్నది: మంత్రి సత్యవతి

మరోవైపు నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నది. ఆమె ఆత్మహత్యయత్నానికి పీజీ విద్యార్థి సైఫ్‌ వేధింపులే కారణమని భావించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. చికిత్స పొందుతున్న ప్రీతిని మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతు ప్రీతికి మెరుగైన వైద్యం అందుతున్నదని గత రెండు రోజుల కంటే పరిస్థితి మెరుగుపడిందన్నారు.

ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీ నియమించిందని తెలిపారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రీతి ఆరోగ్యంపై గంట గంటకు సమీక్షిస్తున్నారు. వైద్యంతో పాటు భగవంతుడి ఆశీస్సులతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కోలుకున్నాక పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను తీసుకుంటారని, రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు.