BRO | పవర్ స్టార్ మేనియా అంటే ఇదే మరి.. తొలిరోజు బ్రో ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందంటే..!
BRO: దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. చిత్రంలో కథానాయికలుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన […]

BRO: దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘వినోదయ సీతమ్’ అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. చిత్రంలో కథానాయికలుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో సినిమా బిజినెస్ కూడా భారీగా జరుపుకుంది. బ్రో చిత్రానికి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో బ్రో చిత్రం రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకోగా, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు రూ. 30 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జూలై 28న బ్రో చిత్రం తెలుగు బెల్ట్‌లో బ్రో సినిమా 76.77% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ 14 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం వలన తెలుగు రాష్ట్రాలలో ఆశించిన రెస్పాన్స్ బ్రో మూవీకి రాకపోయిన ప్రపంచ వ్యాప్తంగా మాత్రం అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి
బ్రొ చిత్రం నైజాంలో రూ. 8.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.98 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో కలిపి.. రూ. 23.61 కోట్లు షేర్, రూ. 35.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఆంధ్రా, తెలంగాణలో రూ. 23.61 కోట్లు రాబట్టిన ఈ చిత్రం కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు వసూళ్లు రాబట్టిది.అంటే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.01 కోట్లు షేర్, రూ. 48.50 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా చెబుతుండగా, ఈ మూవీ ఫస్ట్ డే రూ. 30.01 కోట్లు రాబట్టింది. రానున్న రోజులలో మరో రూ. 68.49 కోట్లు రాబడితేనే ఈ మూవీ కంప్లీట్ హిట్ అయ్యే అవకాశం ఉంది.