ఆంధ్రప్రశ్‌లో ప‌వ‌న్ కళ్యాణ్‌(జనసేన)తో BRS పొత్తు ?

ఏపీలో గులాబీకి తోడుగా వామపక్ష పార్టీలు ఏపీలోనూ టీడీపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ సన్నాహాలు కేసీఆర్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌న్నిహిత సంబంధాలు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు ఉన్న‌మాట‌: ఆంధ్రప్రశ్‌లో జనసేనతో కలిసి బీఆర్ఎస్‌ అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా ఏపీలో అడుగు పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో జనసేనాని ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని యోచిస్తున్నారు. అలాగే ఏపీలోనూ టీడీపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో […]

  • By: Somu    latest    Oct 08, 2022 10:36 AM IST
ఆంధ్రప్రశ్‌లో ప‌వ‌న్ కళ్యాణ్‌(జనసేన)తో BRS పొత్తు ?
  • ఏపీలో గులాబీకి తోడుగా వామపక్ష పార్టీలు
  • ఏపీలోనూ టీడీపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ సన్నాహాలు
  • కేసీఆర్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌న్నిహిత సంబంధాలు
  • త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు

ఉన్న‌మాట‌: ఆంధ్రప్రశ్‌లో జనసేనతో కలిసి బీఆర్ఎస్‌ అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా ఏపీలో అడుగు పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో జనసేనాని ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని యోచిస్తున్నారు. అలాగే ఏపీలోనూ టీడీపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ పేరుతో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు

ఆంద్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితితో స్నేహబంధం కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే పార్టీలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల పోరు ద్విముఖం అవుతుందా.. త్రిముఖం అవుతుందా? అనే మీమాంస నడుస్తోంది. బీజేపీని వెంటపెట్టుకుని, పవన్ చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధ పడితే పోరు ద్విముఖమే. చంద్రబాబే ముఖ్యం అనుకుని బీజేపీని బేఖాతర్ చేస్తే పోరు త్రిముఖం అవుతుంది. పవన్ కల్యాణ్‌తో నిమిత్తం లేకుండా సొంతంగా బరిలోకి దిగడానికి బీజేపీ సిద్ధంగానే ఉంది.

అయితే తాజాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఏపీలో వారి అడుగులు ఎలా ఉంటాయనే విషయంలో నెమ్మదిగా సంశయాలు తొలగుతున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో గులాబీకి వెన్నుదన్నుగా ఉండడానికి, తద్వారా స్వకార్యం కూడా నెరవేర్చుకోవడానికి, ఎర్రదండు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు కూడా. కొన్ని అంశాల్లో కేసీఆర్‌ను వ్యతిరేకిస్తుంటాం గానీ ఆయన బిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ద‌స‌రా ప‌ర్వ‌దినాన అవ‌త‌రించిన భార‌తీయ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)తో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొత్తు పెట్టుకుంటారా? అంటే కొట్టి పారేయ‌లేం అనే స‌మాధానం వ‌స్తోంది. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. వారంటే ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక గౌర‌వం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయం కంటే వ్య‌క్తిగ‌త సంబంధాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రారంభించ‌నున్న బీఆర్ఎస్ నుంచి జ‌న‌సేన‌కు స్నేహ హ‌స్తం అందించే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తెలంగాణ బీజేపీ నేత‌లు గ‌తంలో అవాకులు చెవాకులు పేలారు. ఏపీలో బీజేపీతో ప‌వ‌న్‌కు పొత్తు అనే మాటే త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో ఎక్క‌డా క‌లిసి ప‌ని చేస్తున్న దాఖ‌లాలు లేవు. పైగా ఇంత వ‌ర‌కూ ప్ర‌ధాని నరేంద్ర మోడీ, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా త‌న‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌నే ఆవేద‌న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో బ‌లంగా ఉంది. ఏపీ బీజేపీ నేత‌ల‌తో ప‌వ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలు లేక‌పోవ‌డం, అలాగే త‌మ‌కు ఆప్తుడైన నేప‌థ్యంలో జ‌న‌సేనానితో ఏపీలో కేసీఆర్ పొత్తు పెట్టుకోవ‌చ్చ‌నే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.

గ‌తంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ అంటే పోరుగ‌డ్డ అని, ఏపీలో మాదిరిగా అక్క‌డ కుల రాజ‌కీయాలు లేవ‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే ప్ర‌శంసిస్తూ వుంటారు. తెలంగాణ సాధ‌న కోసం ఏర్ప‌డిన టీఆర్ఎస్‌, కాల‌క్ర‌మంలో దేశ అవ‌స‌రాల నిమిత్తం భార‌తీయ రాష్ట్ర స‌మితిగా ఏర్ప‌డుతోంద‌ని, క‌లిసి ప‌ని చేయాల‌ని కేసీఆర్ వైపు నుంచి ఏపీలోని వివిధ పార్టీల ప్ర‌ముఖుల‌కు ఇప్ప‌టికే ఆహ్వానం అందిన‌ట్టు తెలిసింది.

ఆహ్వానం అందుకున్న వారిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఉన్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీఆర్ఎస్‌తో పొత్తు, ప‌ర్య‌వ‌సానాల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉన్నా లేక‌పోయినా, త‌న మార్క్ మ‌ద్ద‌తు మాత్రం ప‌వ‌న్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏర్పాటుతో రంజుగా మారాయి.

ఆల్రెడీ బిఆర్ఎస్‌తో తెలంగాణలో ఎర్ర పార్టీలు పొత్తుల్లోనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే సిపిఐ, సిపిఎం పార్టీలు రెండింటికీ బిజెపి వ్యతిరేకతను మించిన ఎజెండా వేరే ఏమీ ఉండదు. అదే ఎజెండాతో చాలా దూకుడుగా వస్తున్న కేసీఆర్‌కు వారు మద్దతివ్వకుండా ఉంటారనుకోవడం భ్రమ. అయితే కేసీఆర్– బిఆర్ఎస్ కు మద్దతివ్వడం లేదా పొత్తు పెట్టుకోవడం అనే బంధం ద్వారా ఏపీలో తమ పార్టీకి కూడా ఏ కొంచెమైనా లాభం ఉంటుందనే ఆశ వారికి ఉండొచ్చు.

ఏపీలో బిఆర్ఎస్‌తో వామపక్ష పార్టీలు జట్టు కడుతుందనేది అనూహ్యమైన సంగతేమీ కాదు. కానీ ఈ పొత్తుబంధం ద్వారా వాళ్లు ఎలా లబ్ధిపొందగలరనేదే ప్రశ్న. వామపక్ష పార్టీలకు ఏపీలో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ ఏ ఎన్నికలొచ్చినా వారికి దక్కేసీట్లు మాత్రం ఉండవు. సీట్లు పొందిన సందర్భాలన్నీ ఇతరులతో పొత్తు పెట్టుకుని వాటాగా తీసుకున్నచోట్ల పోటీచేసినప్పుడు మాత్రమే.

కానీ ఏపీలో అధికారం మీద ఆశ ఉండే స్థానిక ప్రాంతీయ పార్టీలు చాలా స్వల్పంగా మాత్రమే వారికి సీట్లు కేటాయిస్తూ వచ్చాయి. కానీ బిఆర్ఎస్ తో వారికి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. పోటీచేసే ఓపిక ఉండాలే గానీ ఎక్కువ సీట్లు దక్కవచ్చు. కేసీఆర్ అండవలన రొటీన్ గా ఉండే బలం కంటె ఎక్కువ ఓట్లు వారికి దక్కవచ్చు. సీట్లు అనేది అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి