BRS | నేడు BRS.. ప్రతినిధుల సమావేశం

విధాత: ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్‌ఎస్‌(BRS) నిర్వహించనున్న ప్రతినిధుల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఆసక్తి నెలకొన్నది. బీఆర్‌ఎస్‌(BRS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాధారణంగా నిర్వహించాల్సిన ప్రతినిధుల సభ (ప్లీనరీ) స్థానంలో పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ వరంగల్‌లో అక్టోబర్‌ 10న జరుగుతుందని గతంలో ప్రకటించిన సంగతి విధితమే. ఈరోజు […]

  • By: krs    latest    Apr 27, 2023 1:10 AM IST
BRS | నేడు BRS.. ప్రతినిధుల సమావేశం

విధాత: ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్‌ఎస్‌(BRS) నిర్వహించనున్న ప్రతినిధుల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఆసక్తి నెలకొన్నది.

బీఆర్‌ఎస్‌(BRS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాధారణంగా నిర్వహించాల్సిన ప్రతినిధుల సభ (ప్లీనరీ) స్థానంలో పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ వరంగల్‌లో అక్టోబర్‌ 10న జరుగుతుందని గతంలో ప్రకటించిన సంగతి విధితమే.

ఈరోజు తెలంగాణభవన్‌లో జరిగే ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.

ఉదయం పది గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం మధ్యాహ్నం లంచ్‌ తర్వాత సాయంత్రం వరకు కొనసాగనున్నది. ఈ కీలక సమావేశంలో కేసీఆర్‌తో పాటు ఎడెనిమిది మందికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

సమావేశంలో పలు అంశాలపై చర్చించి వాటిని ఆమోదించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై గులబీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.