Warangal: ప్రజాసమస్యలు బుట్ట దాఖలు చేసిన BRS ప్రభుత్వం: రాజేందర్‌రెడ్డి
సీజనల్ ఫ్రూట్స్ లాగా కొందరు వస్తున్నారు.. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా […]

- సీజనల్ ఫ్రూట్స్ లాగా కొందరు వస్తున్నారు..
- హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలు ఓట్లు వేసి మిమ్ములను ప్రజా ప్రతినిధులను చేస్తే మీకు ప్రజల గోసలు తెలవడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే మీకు ప్రజలు, వారి బాగోగులు గుర్తుకు వస్తాయా ధ్వజమెత్తారు. స్థానిక కార్పొరేటర్, స్థానిక ఎమ్మెల్యే మార్కెట్లో ఉన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఏ రోజు కూడా మార్కెట్లోని రోడ్ల పక్కన ఉన్నడ్రైనేజీల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇక్కడ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి వైఫల్యం స్పష్టంగా కన్పిస్తున్నది. ప్రణాళికలు లేకుండా పనులు మొదలు పెట్టి అసంపూర్ణంగా వదిలి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకులకు ఎంత సేపు ప్రజలను దోచుకోవడం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
సీజనల్ ఫ్రూట్స్ లాగా కొందరు నాయకులు పాదయాత్రల పేరుతో డివిజన్‌కి వస్తున్నారని వారినీ ప్రజలు గమనించాలంటూ పోటీ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తక్కలపల్లి మనోహర్, బిన్నీ లక్ష్మణ్, డాన్ శ్యాం, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, గడ్డం రమేష్, విజేందర్, భారతి, మహమ్మద్ మన్నన్, సంసాని వంశి కృష్ణ, జి. శివ, నరసింగ రావు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.