BRS కు షాక్‌.. పార్టీకి నిజాంపేట ZPTC గుడ్‌బై! ఎమ్మెల్యే పద్మా రెడ్డి అడుగడుగునా అడ్డుకుంటున్నారు

BRS ఎమ్మెల్యే పద్మా దేవేంద‌ర్‌రెడ్డి.. అడుగడుగునా అడ్డుకుంటున్నారు మెదక్ నియోజక వర్గంలో విద్యా. వైద్యం అందని ద్రాక్ష అయ్యాయి మీడియా సమావేశంలో నిజాంపేట్ జ‌డ్పీటీసీ పంజా విజయ్ కుమార్ విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని, అభివృద్ధి విషయంలో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ BRSకు రాజీనామా చేస్తున్నట్లు నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మెదక్ లో శుక్ర‌వారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో […]

BRS కు షాక్‌.. పార్టీకి నిజాంపేట ZPTC గుడ్‌బై! ఎమ్మెల్యే పద్మా రెడ్డి అడుగడుగునా అడ్డుకుంటున్నారు

BRS

  • ఎమ్మెల్యే పద్మా దేవేంద‌ర్‌రెడ్డి.. అడుగడుగునా అడ్డుకుంటున్నారు
  • మెదక్ నియోజక వర్గంలో విద్యా. వైద్యం అందని ద్రాక్ష అయ్యాయి
  • మీడియా సమావేశంలో నిజాంపేట్ జ‌డ్పీటీసీ పంజా విజయ్ కుమార్

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని, అభివృద్ధి విషయంలో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ BRSకు రాజీనామా చేస్తున్నట్లు నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మెదక్ లో శుక్ర‌వారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో నవాబు పాలన నడుస్తోందని ఆరోపించారు. జడ్పీటీసీ అతని అనుచరులు mro, mpdo పోలీస్ స్టేషన్‌కు ఎవరు వచ్చినా వారికి ఎలాంటి సాయం చేయవద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారని తెలిపారు.. అభివృద్ధి చేసేవాళ్లను పార్టీలో తొక్కేస్తున్నారని ఆరోపించారు.

మెదక్ ప్రజలకు విద్యా, వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షలా ఉందని, ఇన్ని సంవత్సరాలు ఎవరు పాలించిన మన స్థితిగతులు మారలేదని అన్నారు. ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూ ముందుకు సాగుతామన్నారు. బీసీ బిడ్డనని నాపై వివక్ష చూపుతున్నార‌ని, నాలాంటి బిడ్డలు ఎంతో మంది బలి అవుతున్నారని, బయటకు చెప్పితే కేసులు పెడుతున్నార‌ని భ‌య‌ ప‌డుతున్నార‌న్నారు.

జడ్పీటీసీతో సన్నిహితంగా ఉన్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయించారని తెలిపారు. ప్రశ్నిస్తే పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పెట్టారని తెలిపారు. ప్రశ్నించక పోతే సమాజంలో ద్రోహిగా మిగిలిపోతానన్నారు.

నిజాంపేట మండలంలో ఒక వివాహానికి జడ్పీ చైర్ పర్సన్ హాజరైతే నా పర్మిషన్ లేకుండా ఎలా హాజరు అవుతావని ప్రశ్నించారన్నారు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చాను తప్ప స్వలాభం కోసం రాలేదని, అలా వచ్చినట్టయితే మెదక్ రాందాస్ చౌరస్తాలో ఉరి తీయండని అన్నారు.

నాలా వివక్షకు గురై బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న చాలా మంది సర్పంచులు ప్రజా ప్రతినిధులు టచ్‌లో ఉన్నారని అందరితో మాట్లాడి రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలెక్టరేట్ కార్యాలయాలు ఎస్పీ ఆఫీసులు త్వరితగతిన నిర్మించారు తప్ప ప్రజలకు ఏం చేయలేదని అన్నారు.

నిజాంపేట మండలంలో mro, mpdo, పోలీస్ స్టేషన్ అద్దె భవనంలో ఉన్నాయి.. దీనికి కారకులు ఎవరని ప్రశ్నించారు. అద్దె భవనాలకు కిరాయి చెల్లించే పరిస్థితి లేదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి కానీ మన కలెక్టరేట్ మాత్రం ప్రారంభం కాలేదని ఈ దుస్థితికి కారకులు ఎవరని ప్ర‌శ్నించారు.

ఐదు సంవత్సరాలుగా రామయంపేటలో కిలోమీటర్ రోడ్డు వేయలేక పోతున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కామరెడ్డి లాగా మెదక్‌ను రోల్ మోడల్ చేయండని వేడుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా చేస్తే మీరు నిజాంపేటకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ వచ్చినప్పుడు మెదక్ లో డ్రైనేజీ సిస్టం చాలా ప్రాబ్లంగా ఉంది అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని కోరారు. మెదక్ లో చిన్నపాటి వర్షం పడిన రహదారులు అస్తవ్యస్తంగా అవుతున్నాయన్నారు. దీనికి కారణం ఎవరని మండిప‌డ్డారు.

రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం 120 రోజుల‌కు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే మొదటగా రామాయం పేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు కానీ రామాయంపేట మాత్రం చేయలేదని, మా రామాయంపేట మీద ఎందుకు వివక్ష చూపుతున్నా రని నిలదీశారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలేక పోతున్నారని విమర్శించారు. రామాయంపేట గతంలో నియోజకవర్గం కానీ అక్కడ ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నిజాంపేట జడ్పీటీసీ, mroకు ఎస్సైకి హుకుమ్ జారీ చేశారు. జెడ్పిటిసి కానీ జడ్పీటీసీ అనుచరులు గాని వస్తే ఏ పని చేయొద్దు అని మెదక్ ఎమ్మెల్యే చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

పార్టీలో ఉండి పార్టీలో ఉన్న వారిని తుంగలో తొక్కే ప్రయత్నం చేశార‌ని ఆరోపించారు. నేను ఆస్తులు అడగలేదు.. ప్రజల సమస్యల మీద మాత్రమే వెళ్ళానని తెలిపారు. జడ్పీటీసీ హోదాను ఎక్కడ కూడా వాడలేదని అన్నారు.

రోల్ మెడల్ కేటీఆర్‌

పార్టీ కోసం పనిచేసే వాళ్లను నష్టం పరుస్తున్నారని విమ‌ర్శించారు. ఆత్మీయ సమ్మేళనాలకు సర్పంచ్ లకు mptc లకు పిలుపు లేదని అన్నారు. రెండున్నర కోట్లు పెద్ద మొత్తంలో రైతుల ధనాన్ని దుర్వినియోగం చేసి, రైతులకు కన్నీటిని మిగిల్చిన దేవేందర్ రెడ్డి పదవి అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారని విమ‌ర్శించారు.