KTR | బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఆగ్ర‌హం..

KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అవ‌మానించార‌న్న కార‌ణంతో కాంగ్రెస్ ఎంపీపై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, మ‌రి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అత్యంత నీచ‌మైన భాష‌లో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో లోక్‌స‌భ స్పీక‌ర్ చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని […]

  • By: raj    latest    Aug 11, 2023 12:38 AM IST
KTR | బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఆగ్ర‌హం..

KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అవ‌మానించార‌న్న కార‌ణంతో కాంగ్రెస్ ఎంపీపై చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, మ‌రి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అత్యంత నీచ‌మైన భాష‌లో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో లోక్‌స‌భ స్పీక‌ర్ చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్‌ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్‌ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏం చేస్తారు..?’ అని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.