టీజేఎస్ లో చేరిన బీఎస్పీ నాయకులు

బీఎస్పీ అధ్యక్షుడు ఆరెస్ ప్రవీణ్‌కుమార్ ఒకవైపు బీఆరెస్‌తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇంకోవైపు ఆ పార్టీలోని అసంతృప్తి వాదులు పార్టీని వీడుతు ఆరెస్పీకి షాక్ ఇస్తున్నారు

  • Publish Date - March 6, 2024 / 10:13 AM IST
  • కోదండరామ్ సమక్షంలో చేరికలు

విధాత : బీఎస్పీ అధ్యక్షుడు ఆరెస్ ప్రవీణ్‌కుమార్ ఒకవైపు బీఆరెస్‌తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇంకోవైపు ఆ పార్టీలోని అసంతృప్తి వాదులు పార్టీని వీడుతు ఆరెస్పీకి షాక్ ఇస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు జి నాగేశ్వరరావు, మునుగోడు నియోజకవర్గ నాయకులు మల్గా యాదయ్య, నారీ బాలరాజులు బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో టీజేఎస్‌లో చేరారు. కోదండరామ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జిల్లా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నల్లగొండ టీజేఎస్‌ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధనకు తెలంగాణ జన సమితి కృషి చేస్తుందన్నారు. అవినీతి రహిత ఆత్మగౌరవంతో కూడిన రాష్ట్ర నిర్మాణం కోసం ఉద్యమకారులు మేధావులు నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ జన సమితిలో చేరాలని కోరారు. భవిష్యత్తులో మండల, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తామని, త్వరలోనే మరింత మంది బీఎస్పీ నాయకులు కార్యకర్తలు టీజేఎస్ లో చేరుతారని తెలిపారు