లోన్‌ యాప్‌ వేధింపులతో యువకుడి బలవన్మరణం

లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. సంగారెడ్డి జిల్లాలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న మనోజ్‌ లోన్‌యాప్‌ ఏజెంట్ల టార్చర్ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

  • By: Somu    latest    Feb 27, 2024 12:40 PM IST
లోన్‌ యాప్‌ వేధింపులతో యువకుడి బలవన్మరణం

విధాత, హైదరాబాద్‌ : లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా దుండిగల్‌ ఏరోనాటిక్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న మనోజ్‌ లోన్‌ రికవరీలో భాగంగా లోన్‌యాప్‌ ఏజెంట్ల వరుస ఫోన్లతో టార్చర్ పెట్టడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.


మనోజ్ ఓ లోన్‌ యాప్‌లో లోన్‌ తీసుకోగా, ఈఎంఐ కట్టాలని పదే పదే ఫోన్లతో ఒత్తిడి తేవడంతో పాటు అతని బంధువులు, కుటుంబ సభ్యులకు యాప్‌ ఏజెంట్లు ఫోన్లు చేశారు. యాప్‌ ఏజెంట్లు చేసిన అవమానంతో మనోజ్ కాలేజీలో అత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.