ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ : హరీశ్‌రావు
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఉదయం 10.30 గంటలకు మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి బడ్జెట్ దస్త్రాలతో తన నివాసం నుంచి బయలుదేరారు. ఆలయం పూజలు నిర్వహించి అనంతరం అసెంబ్లీకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్రం […]

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఉదయం 10.30 గంటలకు మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి బడ్జెట్ దస్త్రాలతో తన నివాసం నుంచి బయలుదేరారు. ఆలయం పూజలు నిర్వహించి అనంతరం అసెంబ్లీకి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్న హరీశ్‌రావు.. ఈ మోడల్‌ను దేశం అనుసరిస్తుందని చెప్పుకొచ్చారు. బడ్జెట్‌కు మంత్రివర్గంతో పాటు గవర్నర్ ఆమోదం లభించిందని వెల్లడించారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారని వివరించారు.