మ‌హిళ స్టెప్పుల‌కు అనుగుణంగా బ‌ర్రె డ్యాన్స్.. వీడియో వైర‌ల్

విధాత: కొంద‌రు రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా స్టార్లు అయిపోతున్నారు. అలానే కొన్ని పెంపుడు జంతువులు కూడా డ్యాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన సంఘ‌ట‌న‌లు చూశాం. ఆ మాదిరిగానే ఓ బ‌ర్రె కూడా మ‌హిళ స్టెప్పుల‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసి.. సోష‌ల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఓ మ‌హిళ త‌మ బ‌ర్రెల‌కు మేత వేస్తూ భాంగ్రా డ్యాన్స్ చేసింది. బ‌ర్రె మొద‌ట్లో త‌ల ఊపుతూ స్టెప్పు లేసింది. మ‌హిళ మరోసారి స్టెప్పులేయ‌గా, ఈ సారి […]

మ‌హిళ స్టెప్పుల‌కు అనుగుణంగా బ‌ర్రె డ్యాన్స్.. వీడియో వైర‌ల్

విధాత: కొంద‌రు రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా స్టార్లు అయిపోతున్నారు. అలానే కొన్ని పెంపుడు జంతువులు కూడా డ్యాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన సంఘ‌ట‌న‌లు చూశాం. ఆ మాదిరిగానే ఓ బ‌ర్రె కూడా మ‌హిళ స్టెప్పుల‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసి.. సోష‌ల్ మీడియా స్టార్‌గా మారిపోయింది.

ఓ మ‌హిళ త‌మ బ‌ర్రెల‌కు మేత వేస్తూ భాంగ్రా డ్యాన్స్ చేసింది. బ‌ర్రె మొద‌ట్లో త‌ల ఊపుతూ స్టెప్పు లేసింది. మ‌హిళ మరోసారి స్టెప్పులేయ‌గా, ఈ సారి బ‌ర్రెలో హుషారు వ‌చ్చి ఎగిరింది.

దీంతో దానిపై ఉన్న బ‌ట్ట కూడా కింద ప‌డింది. బ‌ర్రె డ్యాన్స్‌ను చూసి ఆ మ‌హిళ పిల్ల‌లు కూడా ప‌డిప‌డి న‌వ్వారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.