సింహంపై బ‌ర్రెల గుంపు మూకుమ్మ‌డి దాడి.. వీడియో వైర‌ల్

Lion | అడ‌వికి రారాజు సింహం. అది అత్యంత క్రూర మృగం కూడా. ఎందుకంటే క‌నిపించిన జంతువుల‌న్నింటినీ చంపేసి తిన‌డానికి య‌త్నిస్తుంటుంది. సింహం బారి నుంచి త‌ప్పించుకునేందుకు మిగ‌తా జంతువులు కూడా తీవ్రంగా య‌త్నిస్తాయి. కానీ ఈ బ‌ర్రెల గుంపు మాత్రం ఓ ముసలి సింహంపై మూకుమ్మ‌డి దాడి చేశాయి. సింహాన్ని వ‌ణుకు పుట్టించాయి. ప‌దేప‌దే ఆ మృగ‌రాజును పైకి లేపి త‌మ కొమ్ముల‌తో ఎత్తేశాయి. సింహాంపై బ‌ర్రెల దాడి ఘ‌ట‌న వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో […]

సింహంపై బ‌ర్రెల గుంపు మూకుమ్మ‌డి దాడి.. వీడియో వైర‌ల్

Lion | అడ‌వికి రారాజు సింహం. అది అత్యంత క్రూర మృగం కూడా. ఎందుకంటే క‌నిపించిన జంతువుల‌న్నింటినీ చంపేసి తిన‌డానికి య‌త్నిస్తుంటుంది. సింహం బారి నుంచి త‌ప్పించుకునేందుకు మిగ‌తా జంతువులు కూడా తీవ్రంగా య‌త్నిస్తాయి. కానీ ఈ బ‌ర్రెల గుంపు మాత్రం ఓ ముసలి సింహంపై మూకుమ్మ‌డి దాడి చేశాయి. సింహాన్ని వ‌ణుకు పుట్టించాయి. ప‌దేప‌దే ఆ మృగ‌రాజును పైకి లేపి త‌మ కొమ్ముల‌తో ఎత్తేశాయి. సింహాంపై బ‌ర్రెల దాడి ఘ‌ట‌న వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోను వైల్డ్ ఫోటోగ్రాప‌ర్ డీన్ కెల్‌బ్రిక్ త‌న ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. అయితే సింహం పేరును డార్క్ మేన్ అవోకాగా కెల్‌బ్రిక్ పేర్కొన్నారు. తీవ్ర గాయాల‌పాలైన సింహం మూడు రోజుల త‌ర్వాత చ‌నిపోయిన‌ట్లు అత‌ను వెల్ల‌డించారు.