వ్యాపారి న‌గ్న దృశ్యాలు.. CI, CBI పేర్లతో రూ. 2.69 కోట్లు వ‌సూలు

Gujarat | ఆయ‌న గుజ‌రాత్‌కు చెందిన ఓ వ్యాపారి. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి ఆయ‌న‌. అయితే ఓ మ‌హిళ చేసిన వీడియో కాల్‌కు స్పందించాడు. ఆమె ఆ వ్యాపారిలో కోరిక‌లు ర‌గిలించింది. ఇంకేముంది.. ఆమె ముందు వాట్సాప్‌లో న‌గ్నంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఆ న‌గ్న వీడియోల‌ను అడ్డుగా పెట్టుకుని, ఏకంగా రూ. 2.69 కోట్లు వ‌సూలు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారికి గ‌తేడాది ఆగ‌స్టు 8వ తేదీన రియాశ‌ర్మ‌ (మోర్బి) అనే […]

వ్యాపారి న‌గ్న దృశ్యాలు.. CI, CBI పేర్లతో రూ. 2.69 కోట్లు వ‌సూలు

Gujarat | ఆయ‌న గుజ‌రాత్‌కు చెందిన ఓ వ్యాపారి. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి ఆయ‌న‌. అయితే ఓ మ‌హిళ చేసిన వీడియో కాల్‌కు స్పందించాడు. ఆమె ఆ వ్యాపారిలో కోరిక‌లు ర‌గిలించింది. ఇంకేముంది.. ఆమె ముందు వాట్సాప్‌లో న‌గ్నంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఆ న‌గ్న వీడియోల‌ను అడ్డుగా పెట్టుకుని, ఏకంగా రూ. 2.69 కోట్లు వ‌సూలు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారికి గ‌తేడాది ఆగ‌స్టు 8వ తేదీన రియాశ‌ర్మ‌ (మోర్బి) అనే మ‌హిళ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమె వ్యాపారిలో శృంగార కోరిక‌ల‌ను ప్రేరేపించింది. దీంతో వ్యాపారి న‌గ్నంగా మారిపోవ‌డంతో.. ఆ దృశ్యాల‌ను త‌న ఫోన్‌లో రికార్డు చేసింది. అనంత‌రం త‌న‌కు రూ. 50 వేలు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. లేదంటే ఈ వీడియోల‌ను బ‌య‌ట‌ పెడుతాన‌ని హెచ్చ‌రించింది. చేసేదేమీ లేక ఆ వ్యాపారి రూ. 50 వేలు ఇచ్చేశాడు.

కొద్ది రోజుల‌కు ఢిల్లీ నుంచి ఇన్‌స్పెక్ట‌ర్‌ను మాట్లాడుతున్నాన‌ని ఆ వ్యాపారికి ఫోన్ కాల్ వ‌చ్చింది. అత‌ను కూడా వీడియోల పేరుతో రూ.3 ల‌క్ష‌లు వ‌సూలు చేశాడు. ఆగ‌స్టు 14న మ‌రో వ్య‌క్తి ఫోన్ చేసి ఢిల్లీ సైబ‌ర్ క్రైమ్ సిబ్బందిన‌ని ప‌రిచ‌యం చేసుకున్నాడు. రియా శ‌ర్మ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింద‌ని చెప్పి, దానికి మీ వీడియోనే కార‌ణ‌మ‌ని చెప్పి రూ. 80.97 ల‌క్ష‌లు కాజేశాడు.

మరి కొన్నాళ్ల‌కు వ్యాపారికి సీబీఐ ఆఫీస‌ర్‌ను అని చెప్పి మ‌రో ఫోన్ కాల్ వ‌చ్చింది. వీడియోల వ్య‌వ‌హారంపై రియా త‌ల్లి సీబీఐని ఆశ్ర‌యించింద‌ని తెలిపాడు. కేసును సెటిల్‌మెంట్ చేసేందుకు రూ. 8.5 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌డంతో, ఆ న‌గ‌దు కూడా ఇచ్చేశాడు.

ఇక కేసును మూసి వేసిన‌ట్లు డిసెంబ‌ర్ 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు పేరిట న‌కిలీ ఉత్త‌ర్వులు అందాయి. ఈ ఉత్త‌ర్వులు న‌కిలీ అని గ్ర‌హించిన వ్యాపారి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను జ‌న‌వ‌రి 10న‌ ఆశ్ర‌యించాడు. మొత్తం 11 మంది క‌లిసి రూ. 2.69 కోట్లు కాజేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.