Pakistan | 8 గంట‌లుగా గాల్లో కేబుల్ కార్‌.. 8 మంది ప్రాణాల‌కు ముప్పు

Pakistan | విధాత‌: పాకిస్థాన్‌లో ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండు భారీ కొండ‌ల మ‌ధ్య ప్ర‌యాణించే ఒక కేబుల్ కార్.. మ‌ధ్య‌లో ఉండ‌గా దాని ఒక తీగ తెగిపోయింది. దీంతో మ‌రో తీగ‌పైనే 3000 అడుగుల ఎత్తులో గాల్లో వేల్లాడుతోంది. ఇందులో ఏడుగురు పాఠ‌శాల విద్యార్థులు, మ‌రో వ్య‌క్తి ప్ర‌యాణిస్తున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన ఖైబ‌ర్ ప‌ఖ్తూన్‌ఖ్వాలోని బ‌ట్టాగ్రామ్.. కొండ‌లు, లోయ‌ల‌తో నిండి ఉంటుంది. రోడ్ల‌ వ‌స‌తులు చాలా త‌క్కువ‌. అందుకే కొండ‌ల మ‌ధ్య లోయ‌ల‌ను […]

Pakistan | 8 గంట‌లుగా గాల్లో కేబుల్ కార్‌.. 8 మంది ప్రాణాల‌కు ముప్పు

Pakistan |

విధాత‌: పాకిస్థాన్‌లో ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండు భారీ కొండ‌ల మ‌ధ్య ప్ర‌యాణించే ఒక కేబుల్ కార్.. మ‌ధ్య‌లో ఉండ‌గా దాని ఒక తీగ తెగిపోయింది. దీంతో మ‌రో తీగ‌పైనే 3000 అడుగుల ఎత్తులో గాల్లో వేల్లాడుతోంది. ఇందులో ఏడుగురు పాఠ‌శాల విద్యార్థులు, మ‌రో వ్య‌క్తి ప్ర‌యాణిస్తున్నారు.

ఘ‌ట‌న జ‌రిగిన ఖైబ‌ర్ ప‌ఖ్తూన్‌ఖ్వాలోని బ‌ట్టాగ్రామ్.. కొండ‌లు, లోయ‌ల‌తో నిండి ఉంటుంది. రోడ్ల‌ వ‌స‌తులు చాలా త‌క్కువ‌. అందుకే కొండ‌ల మ‌ధ్య లోయ‌ల‌ను దాట‌డానికి ప్రైవేటు ఆప‌రేట‌ర్లు నిర్వ‌హించే కేబుల్ కార్ల‌ను ప్ర‌జ‌లు ఉప‌యోగిస్తారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌ర‌గగా మ‌ధ్యాహ్నానికి కూడా వారిని బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోయారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అక్క‌డి ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో వారిని నేల‌పైకి ఎలా తీసుకురావాల‌నే దానిపై అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఒక సైనిక హెలికాప్ట‌ర్‌ను ఘ‌ట‌నా స్థ‌లానికి పంపిన‌ప్ప‌టికీ.. అది కూడా ప‌రిస్థితిని స‌మీక్షించి వెళిపోయింది త‌ప్ప‌.. బాధితుల‌ను ర‌క్షించ‌లేక‌పోయింది. చుట్టూ భారీ కొండ‌లు.. వారు ఉన్న‌ది భారీ లోయ‌లో కావ‌డంతో ప‌రిస్థితి మ‌రింత క‌ష్టంగా మారింది. ప్ర‌స్తుతం సైనిక ప్ర‌త్యేక ద‌ళాలు రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు సిద్ధ‌ప‌డుతున్నాయి.