రేపు విచారణకు రాలేను.. CBIకి ఎమ్మెల్సీ కవిత లేఖ
విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత సోమవారం సీబీఐకి మరో లేఖ వ్రాశారు. తాను రేపు 6వ తేదీన విచారణకు రాలేనంటూ, ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉండడంతో తాను విచారణకు అందుబాటులో ఉండలేనని కవిత పేర్కొన్నారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానంటూ లేఖలో పేర్కొన్నారు. తాను విచారణకు వచ్చే ముందు తనకు ఎఫ్ఐఆర్ కాపీ, ఫిర్యాదు కాఫీ ఇవ్వాలని సీబీఐని అడిగితే వెబ్ సైట్ లో […]

విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత సోమవారం సీబీఐకి మరో లేఖ వ్రాశారు. తాను రేపు 6వ తేదీన విచారణకు రాలేనంటూ, ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉండడంతో తాను విచారణకు అందుబాటులో ఉండలేనని కవిత పేర్కొన్నారు.
ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానంటూ లేఖలో పేర్కొన్నారు. తాను విచారణకు వచ్చే ముందు తనకు ఎఫ్ఐఆర్ కాపీ, ఫిర్యాదు కాఫీ ఇవ్వాలని సీబీఐని అడిగితే వెబ్ సైట్ లో చూసుకోవాలంటూ తెలిపారని.. వెబ్ సైట్‌లో ఉన్న ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే అందులో నా పేరు లేదని కవిత ఈ లేఖలో పేర్కొన్నారు.
కాగా అంతకుముందు సీబీఐ కవితకు నోటీస్ జారీ చేసిన సందర్భంలో తాను ఈనెల 6న విచారణకు హాజరవుతానని తెలిపిన కవిత ఇపుడు వేరే తేదీల్లోవిచారణకు ఉంటానని చెప్పడం చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ పిదప ఈ కేసులో సీబీఐతో వ్యవహరించాల్సిన తీరుపై ఆమె వ్యూహాలు మారినట్లుగా కనిపిస్తుంది.