తెలంగాణలో ఆస్తులు కాపాడలేనోడు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు టెండర్‌ వేస్తాడా?: మల్లు భట్టి విక్రమార్క

విశాఖ వరకు ఎందుకు.. బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం బ్యాక్ వాటర్‌ ముంపు రైతులను ఆదుకుంటాం తాము అధికారంలోకి వస్తే తమ్మిడి హట్టి ద్వారా ఉమ్మడి అదిలాబాద్‌ను సస్యశామలం చేస్తాం రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌ మిషన్‌ భగీరథ అంబేద్కర్‌ జయంతి రోజున ఏప్రిల్‌ 14వ తేదీన మంచిర్యాలలో జై భారత్‌ సత్యాగ్రహ దీక్ష మీడియా సమావేశంలో సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: విశాఖ వరకు […]

  • By: krs    latest    Apr 11, 2023 2:09 AM IST
తెలంగాణలో ఆస్తులు కాపాడలేనోడు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు టెండర్‌ వేస్తాడా?: మల్లు భట్టి విక్రమార్క
  • విశాఖ వరకు ఎందుకు.. బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి
  • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం బ్యాక్ వాటర్‌ ముంపు రైతులను ఆదుకుంటాం
  • తాము అధికారంలోకి వస్తే తమ్మిడి హట్టి ద్వారా ఉమ్మడి అదిలాబాద్‌ను సస్యశామలం చేస్తాం
  • రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్‌ మిషన్‌ భగీరథ
  • అంబేద్కర్‌ జయంతి రోజున ఏప్రిల్‌ 14వ తేదీన మంచిర్యాలలో జై భారత్‌ సత్యాగ్రహ దీక్ష
  • మీడియా సమావేశంలో సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క

విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: విశాఖ వరకు ఎందుకు స్వయం శక్తి ఉంటే బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్ట వచ్చు కదా? అని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను అడిగారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్ ఏరియాలో పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లోని అస్తులను కాపాడలేడు, కాని ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు టెండర్ వేస్తాడా ?అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అక్కడి వరకు ఎందుకు ఆ డబ్బులతో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అంటేనే అన్ని రకాల సహజ వనరుల కలిగి ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని భట్టి ఆరోపించారు. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేసి,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కు కేసీఆర్ అన్యాయం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ఒక్క ఎకరాకు సాగు నీరు అందివ్వకపోగా, ప్రాజెక్టు మూలంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని వేల సాగు భూములన్ని బ్యాక్ వాటర్ లో ముంచాడని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2013 చట్టం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బ్యాక్ వాటర్ ముంపు రైతుల వద్ద నుండి భూములను కొనుగోలు చేసి వారిని ఆదుకుంటామని అన్నారు .

తెలంగాణకే తలమానికమైన సింగరేణి గనులను కేసీఆర్ ప్రైవేటీకరణ చేస్తూ తనకు కావాల్సిన వ్యక్తులకు కేటాయిస్తూ పబ్బం గడుపుతున్నాడని మల్లు భట్టి విక్రమార్క ఆరోపంచారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె తుమ్మిడిహట్టి ద్వారా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం,సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థలో ఉండేలా చర్యలు చేపడతాం’ అని భట్టి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకొని ప్లాట్స్ గా చేసి కేసీఆర్ అమ్ముతున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ మరొక సారి అధికారంలోకి వస్తే తెలంగాణ ను సైతం అమ్మకానికి పెడతాడని ఆరోపించారు .

మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని భట్టి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందని కాజీపేట రైల్వే కోచ్,,బయ్యారం ఉక్కు గనులు, ఎయిమ్స్‌, ఐటీఐఆర్‌ గురించి మాట్లాడకుండా మోడీ రాజకీయాలు మాట్లాడి వెళ్లాడన్నారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున మంచిర్యాలలో నిర్వహించే జై భారత్ సత్య గ్రహ దీక్ష భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.దీనికి రాష్ట్ర, దేశ కాంగ్రెస్ నేతలు వస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేటప్పుడు ఒక్క ఇల్లు మాత్రమే ఉన్న ఆయన, దేశంలోనే జరిగే ఎన్నికల్లో ఖర్చు భరిస్తానని చెప్పడం అంటే, ఖర్చు పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. అదంతా తెలంగాణ సొమ్మే అని ఆరోపించారు. మిషన్ భగీరథ కోసం 42,000 వేల కోట్లు ఖర్చు చేశారు కానీ ఏ ఒక్క గ్రామానికి నీళ్ళు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కాం మిషన్ భగీరథ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.