హీరోయిన్ శ్రీ లీల తల్లిపై మరో కేసు!
విధాత: ఒకే ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారిన హీరోయిన్ శ్రీ లీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ లీల.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. అంతేకాదు, ఆమె క్రేజ్ గురించి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఓ నిర్మాత ఆమె కోసం […]

విధాత: ఒకే ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారిన హీరోయిన్ శ్రీ లీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ లీల.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది.
అంతేకాదు, ఆమె క్రేజ్ గురించి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఓ నిర్మాత ఆమె కోసం రోజుకి 20 వేల రూపాయల రెంట్ కడుతున్నాడనేలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. సరే, ఇవన్నీ సినిమా సంగతులైతే.. మరో విషయంలోనూ ఆమె ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.

ఆ విషయం ఏమిటో కాదు.. తన తండ్రి విషయంలో. తండ్రి ఏమో.. ఆమె నా కూతురు కాదంటూ ఈ మధ్య సంచలన కామెంట్స్ చేయడంతో.. శ్రీలీల జన్మ రహస్యం ఓ మిస్టరీగా మారింది. విషయంలోకి వస్తే.. ప్రస్తుతం శ్రీలీల తన తల్లి స్వర్ణలత దగ్గరే ఉంటుంది. శ్రీలీల తండ్రి, స్వర్ణలత భర్త అయిన సుభాకర్ తాజాగా స్వర్ణలతపై కేసు పెట్టాడు.
స్వర్ణలత, సుభాకర్ దాదాపు 20 ఏళ్ల నుంచి విడివిడిగా ఉంటున్నారు. వారి విడాకుల కేసు కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. ఈ టైమ్‌లో కోరమాంగళ్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి.. తను లేని సమయం చూసుకుని వెళ్లి తాళం పగలగొట్టి మరీ లోపలికి వెళ్లిన స్వర్ణలతపై సుభాకర్ కేసు ఫైల్ చేయించాడు. దీంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి స్వర్ణలతపై ఇప్పటికే ఓ కేసు (అలియాన్స్ యూనివర్సిటీ వివాదంలో A2) నడుస్తుంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట తిరుగుతుంది. ఇప్పుడు మరో కేసు కూడా ఆమెపై ఫైల్ అవడంతో.. అసలిప్పుడేం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఇవి కాకుండా మరో మూడు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
