TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక తీర్పు

విధాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పట్టుబడ్డ ముగ్గురు నిందితులను విచారణ చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు తమ దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో దర్యాప్తును నిలిపి వేయాలంటూ ఇచ్చిన స్టేను కోర్టు ఎత్తేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేడయం మంచిది కాదని కోర్టు […]

  • By: krs    latest    Nov 08, 2022 1:28 PM IST
TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక తీర్పు

విధాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పట్టుబడ్డ ముగ్గురు నిందితులను విచారణ చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు తమ దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో దర్యాప్తును నిలిపి వేయాలంటూ ఇచ్చిన స్టేను కోర్టు ఎత్తేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేడయం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం కోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌ల‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురు ప్రస్తుతం చంచ‌ల్ గూడ జైల్లో ఉన్నారు.

అసలేం జరిగిందంటే..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలతో మోయినాబాద్ ఫాం హౌస్‌లో నవంబర్ 26వ తేదీ రాత్రి రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్‌లను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులను పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు.