మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసుల నమోదు

మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, 420చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసుల నమోదు

విధాత : మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, 420చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 47ఎకరాల గిరిజనుల భూములు కబ్జా చేశారని, ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్‌ చేశారని తహశీల్ధార్‌తో పాటు మంత్రిపైన బాధిత గిరిజనులు శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


దీంతో మల్లారెడ్డిపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు తొమ్మిది మంది అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ఈ వివాదంపై విచారణ ప్రారంభించారు.


మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసుల నమోదు వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఆర్మూర్‌ బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 47కోట్ల రుణ బకాయిలు..విద్యుత్తు, ఆర్టీసీ సంస్థలకు కోట్ల రూపాయల బకాయిల వ్యవహారం వివాదస్పదమైంది. ఇప్పుడు మల్లారెడ్డి అక్రమాలపై కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.