సీఎం కేసీఆర్ కు ఓటమి ఖాయం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ఓటమి ఖాయమని, కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన పై తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ఓటమి ఖాయమని, కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన పై తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గురువారం హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో కంటున్న కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం అవుతారన్నారు. మేం అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ఒవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు.
తెలంగాణ సమాజం ఒవైసీ మాటలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి మోడీ అభివృద్ధికి సహకరించారన్నారు. మోడీ హయాంలో విదేశీ మార్గంలో రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 ఐదు లక్షల కోట్ల డాలర్ల నుంచి 35 లక్షల కోట్ల డాలర్లకు పెరగబోతున్నదని ఈ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం కావాలన్నారు. అందుకు తెలంగాణ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.