Challamalla | చల్లమల్ల డబ్బుల రగడ.. ఇంటి ముందు బాధితుల ధర్నా..!
Challamalla | విధాత: కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నేత చల్లమల కృష్ణారెడ్డి తమకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ పలువురు బాధితులు హైదరాబాదులోని ఆయన నివాసం ముందు రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నెల 6వ తేదీన కృష్ణా రెడ్డి కొడుకు వివాహం జరగగా పెళ్లికి డెకరేషన్ చేసిన వ్యాపారులకు, వర్కర్లకు ఏడు లక్షల మేరకు డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ బాధితులు చలమల్ల ఇంటిముందుకు వెళ్లి డబ్బుల కోసం డిమాండ్ […]

Challamalla |
విధాత: కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నేత చల్లమల కృష్ణారెడ్డి తమకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ పలువురు బాధితులు హైదరాబాదులోని ఆయన నివాసం ముందు రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఈ నెల 6వ తేదీన కృష్ణా రెడ్డి కొడుకు వివాహం జరగగా పెళ్లికి డెకరేషన్ చేసిన వ్యాపారులకు, వర్కర్లకు ఏడు లక్షల మేరకు డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ బాధితులు చలమల్ల ఇంటిముందుకు వెళ్లి డబ్బుల కోసం డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చలమల్ల కుటుంబ సభ్యులకు, వారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పినా బాధితులు వినకుండా తమకు డబ్బులు ఇప్పిస్తేనే ఇక్కడ నుండి కదులుతామంటూ భీష్మించారు.
చివరకు ఇరు వర్గాలతో పోలీసులు చర్చించి ఆందోళన విరమింప చేశారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ నాదే, గెలుపు నాదే అంటూ ప్రకటించిన చల్లమల కృష్ణారెడ్డికి సంబంధించిన వివాదం కావడంతో ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో రచ్చగా మారింది.