రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌ట్లేదు- చంద్ర‌బాబు

రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు బుధ‌వారం భేటీ అయ్యారు.

  • By: Somu    latest    Feb 14, 2024 11:28 AM IST
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌ట్లేదు- చంద్ర‌బాబు

అమరావతి, ఫిబ్రవరి 14: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయ‌డం లేద‌ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు బుధ‌వారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై అధినేత వద్ద నేతలు ప్రస్తావించారు. అయితే రాజ్యసభ ఎన్నికల్ల పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ చీఫ్ తేల్చిచెప్పేశారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌రిపడ ఎమ్మెల్యే అభ్య‌ర్థులు లేనికార‌ణంగా పోటీ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.