Chandrababu | బాబు నోట.. జైలు మాట నన్నూ అరెస్ట్ చేస్తారంటూ బేల మాటలు

Chandrababu | ఇన్నాళ్లూ నేను నిప్పును.. నన్ను ఎవరూ టచ్ చేయలేరు . ఇదీ నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్ అని బీరాలు పలికే చంద్రబాబు నోట తొలిసారిగా జైలు మాట వినిపించింది. నన్నూ అరెస్ట్ చేస్తారేమో అనే ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో యువగళం కార్యక్రమంలో పాల్గొన్న యువకుల మీద పోలీసులు కేసులు పెడ్తున్నారని, వైసిపి నాయకులూ సైతం దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు ఇక తననూ అరెస్ట్ చేస్తారేమో […]

  • By: krs    latest    Sep 07, 2023 2:57 AM IST
Chandrababu | బాబు నోట.. జైలు మాట నన్నూ అరెస్ట్ చేస్తారంటూ బేల మాటలు

Chandrababu |

ఇన్నాళ్లూ నేను నిప్పును.. నన్ను ఎవరూ టచ్ చేయలేరు . ఇదీ నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్ అని బీరాలు పలికే చంద్రబాబు నోట తొలిసారిగా జైలు మాట వినిపించింది. నన్నూ అరెస్ట్ చేస్తారేమో అనే ఆందోళన వ్యక్తం చేశారు.

భీమవరంలో యువగళం కార్యక్రమంలో పాల్గొన్న యువకుల మీద పోలీసులు కేసులు పెడ్తున్నారని, వైసిపి నాయకులూ సైతం దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు ఇక తననూ అరెస్ట్ చేస్తారేమో అని అన్నారు.

ఇది సైకో ప్రభుత్వం అని ఆరోపిస్తూ పుంగనూరులో పోలీసులకు టిడిపి కార్యకర్తలకు మధ్య జరిగిన గలాటలో తన మీద సైతం కేసులు బుక్ చేసారని, తానే ఆ ఘటనకు ప్రేరేపించినట్లు చెప్పాల్సిందిగా తమ కార్యకర్తలను పోలీసులు బెదిరించారని ఆరోపించారు.

మరోవైపు కాంట్రాక్టర్ల దగ్గర చంద్రబాబు రూ. 118 కోట్లు , లోకేష్ రూ. 25 కోట్లు ముడుపులు తీసుకున్న తీసుకున్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు ఆ అంశంలో కంగారు పడుతున్నారు.

ముడుపులు ఇచ్చినట్లు మనోజ్ వాసుదేవ్ అనే కన్సల్టెంట్ పూర్తి ఆధారాలు, లెక్కలు ఐటీ శాఖకు చెప్పడంతో చంద్రబాబు సరిగ్గా ఇరుక్కున్నట్లయింది. ఇదిలా ఉండగా ఈ ముడుపుల అంశం మీద ఏపీ సీఐడీ సైతం దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. దీంతో సీఐడీ కానీ తనను అరెస్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.