ChandraShekhar Aazad | నేను గుర్తించ‌లేక పోయాను కానీ.. కాల్పుల ఘ‌ట‌న‌పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్

ChandraShekhar Aazad | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షాహార‌న్‌పూర్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ స్పందించారు. స్పృహలో ఉన్న ఆజాద్ ప‌లు విష‌యాలు చెప్పారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల‌ను తాను గుర్తించ‌లేక‌పోయాన‌ని, త‌న మ‌న‌షులు గుర్తించార‌ని తెలిపారు. వారి కారు షాహార‌న్‌పూర్ వైపు వెళ్లింద‌న్నారు. తాము యూట‌ర్న్ తీసుకున్నాం. కాల్పులు జ‌రిగిన స‌మ‌యంలో త‌న త‌మ్ముడితో స‌హా కారులో ఐదుగురం ఉన్నామ‌ని […]

ChandraShekhar Aazad | నేను గుర్తించ‌లేక పోయాను కానీ.. కాల్పుల ఘ‌ట‌న‌పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్

ChandraShekhar Aazad |

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షాహార‌న్‌పూర్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ స్పందించారు. స్పృహలో ఉన్న ఆజాద్ ప‌లు విష‌యాలు చెప్పారు.

కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల‌ను తాను గుర్తించ‌లేక‌పోయాన‌ని, త‌న మ‌న‌షులు గుర్తించార‌ని తెలిపారు. వారి కారు షాహార‌న్‌పూర్ వైపు వెళ్లింద‌న్నారు. తాము యూట‌ర్న్ తీసుకున్నాం. కాల్పులు జ‌రిగిన స‌మ‌యంలో త‌న త‌మ్ముడితో స‌హా కారులో ఐదుగురం ఉన్నామ‌ని ఆజాద్ పేర్కొన్నారు.

చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ ప్ర‌యాణిస్తున్న కారును ల‌క్ష్యంగా చేసుకున్న దుండ‌గులు.. నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. దీంతో ఆజాద్‌కు ఒక బుల్లెట్ త‌గిలింది. ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు.

కాల్పులు జ‌రిపిన దుండ‌గులు హ‌ర్యానా నంబ‌ర్ ప్లేట్ ఉన్న కారులో వ‌చ్చి ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఆజాద్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని, అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు.

కాల్పులు జ‌రిపిన స‌మ‌యంలో చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ ట‌యోటా ఫార్చున‌ర్‌లో వెళ్తున్నారు. కారు డోర్, సీటుకు బుల్లెట్లు చొచ్చుకెళ్లిన ఆన‌వాళ్లు ఉన్నాయి. అయితే దుండ‌గులు ప‌లు రౌండ్ల కాల్పులు జ‌రిపిన అనంత‌రం ఆజాద్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. కానీ అత‌నికి ఒక బుల్లెట్ మాత్ర‌మే తగిలింది.