Chandrayaan-3 | చంద్రయాన్-3 మరో ముందడుగు.. చంద్రుడికి 30 కిలోమీటర్ల దూరంలో
Chandrayaan-3 | విధాత: జాబిల్లిని అందుకునేందుకు విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్-3 మరో ముందడుగు వేసింది. ప్రొపల్షన్ మోడ్నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రం గురువారం విడిపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది చంద్రుడికి అత్యంత చేరువ కక్ష్యలో తిరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కీలక ఘట్టమైన డీబూస్టింగ్ (కదలికను నెమ్మదించడం) చేసినట్టు ఇస్రో తెలిపింది. ఈ డీబూస్టింగ్ ప్రక్రియలో క్రమంగా వేగం తగ్గించుకుంటూ చంద్రుడికి అత్యంత చేరువలో 30 కిలోమీటర్ల దూరంలో పెరిల్యూన్, 100 కిలోమీటర్ల దూరమైన […]

Chandrayaan-3 |
విధాత: జాబిల్లిని అందుకునేందుకు విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్-3 మరో ముందడుగు వేసింది. ప్రొపల్షన్ మోడ్నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రం గురువారం విడిపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది చంద్రుడికి అత్యంత చేరువ కక్ష్యలో తిరుగుతున్నది.
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కీలక ఘట్టమైన డీబూస్టింగ్ (కదలికను నెమ్మదించడం) చేసినట్టు ఇస్రో తెలిపింది. ఈ డీబూస్టింగ్ ప్రక్రియలో క్రమంగా వేగం తగ్గించుకుంటూ చంద్రుడికి అత్యంత చేరువలో 30 కిలోమీటర్ల దూరంలో పెరిల్యూన్, 100 కిలోమీటర్ల దూరమైన అపోల్యూన్ కక్ష్యలోకి ప్రవేశించనున్నది.
అనంతరం దక్షిణ ధృవ ప్రాంతంలో బుధవారం సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించేందుకు ఇస్రో ప్రయత్నాల్లో ఉన్నది. చంద్రునికి అత్యంత సమీపానికి వెళుతున్న ల్యాండర్.. తన ల్యాండింగ్ పొజిషనింగ్ కెమెరాతో చంద్రుడి తాజా చిత్రాలను పంపించింది. వీటిని ఆగస్ట్ 15న చిత్రీకరించింది. వాటిని ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భూమి కూడా కనిపిస్తున్నది.