Chandrayaan-3 | మామగారూ.. బాగున్నారా! అల్లుడొస్తున్నాడు జాగ్రత్త! రెండు ల్యాండర్ల స్టోరీ లైన్ ఒకటే

Chandrayaan-3 | స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్, బడ్జెట్లు వేర్వేరు ‘లూనా-25’ వ్యయం రూ.1,663 కోట్లు చంద్రరావు గారి ఇంటికి అంటే చంద్రగృహానికి వెళుతున్న మన ఇస్రో ‘విక్రమ్’ ల్యాండర్ అల్లుడు లాంటివాడు. ‘విక్రమ్’ ల్యాండర్ పొట్టలోంచి బయటికొచ్చే ‘ప్రజ్ఞాన్’ రోవర్ (చక్రి) చంద్రుడికి వరుసకు మనవడు! జాబిలిపై ఈ అయ్యాకొడుకుల మకాం 14 రోజులే. అప్పటివరకే వీరికి అక్కడ రాజభోగాలు, సకల మర్యాదలు. ఆ రెండు వారాల పండుగ ముగిస్తే ఇద్దరూ దుకాణం సర్దడమే. ఇక రష్యా […]

  • By: krs    latest    Aug 20, 2023 6:08 PM IST
Chandrayaan-3 | మామగారూ.. బాగున్నారా! అల్లుడొస్తున్నాడు జాగ్రత్త! రెండు ల్యాండర్ల స్టోరీ లైన్ ఒకటే

Chandrayaan-3 |

  • స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్, బడ్జెట్లు వేర్వేరు
  • ‘లూనా-25’ వ్యయం రూ.1,663 కోట్లు

చంద్రరావు గారి ఇంటికి అంటే చంద్రగృహానికి వెళుతున్న మన ఇస్రో ‘విక్రమ్’ ల్యాండర్ అల్లుడు లాంటివాడు. ‘విక్రమ్’ ల్యాండర్ పొట్టలోంచి బయటికొచ్చే ‘ప్రజ్ఞాన్’ రోవర్ (చక్రి) చంద్రుడికి వరుసకు మనవడు! జాబిలిపై ఈ అయ్యాకొడుకుల మకాం 14 రోజులే. అప్పటివరకే వీరికి అక్కడ రాజభోగాలు, సకల మర్యాదలు.

ఆ రెండు వారాల పండుగ ముగిస్తే ఇద్దరూ దుకాణం సర్దడమే. ఇక రష్యా ల్యాండర్ ‘లూనా-25’ చంద్రుడికి కొడుకు లాంటివాడు. వారసుడు వస్తే చెట్టులాగా పాతుకుపోతాడు. సరిగ్గా దిగి.. పని మొదలెట్టాలే గానీ ఏడాదిపాటు అక్కడే పాగా వేసి బస చేస్తాడు.

‘చంద్రయాన్-3’ వ్యయం రూ.615 కోట్లు. బాలీవుడ్లో ఓ భారీ సినిమా తీసేంత ఖర్చు. ‘లూనా-25’ మిషన్ వ్యయాన్ని రష్యా అధికారికంగా వెల్లడించలేదు కానీ.. సుమారు 200 మిలియన్ల డాలర్లు.

అంటే రూ.1,663 కోట్లు. ఇది హాలీవుడ్‌లో ఓ భారీ సినిమా నిర్మించేంతటి బడ్జెట్. మన ‘చంద్రయాన్-3’ కంటే రష్యా అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కుమ్మరించింది. మనది పొదుపు మంత్రం. రష్యాది అట్టహాసం