chandrayaan-3 | ఆరు రోజుల్లో చంద్రుడిపైకి.. ప్రొపల్షన్ మోడ్ నుంచి విడిపడిన విక్రం
chandrayaan-3 | బెంగళూరు: చంద్రయాన్-3 కీలక దశలోకి ప్రవేశించింది. అత్యంత కీలకమైన లాండింగ్‌కు ముందు ప్రొపల్షన్ మోడ్ నుంచి ల్యాండర్ విక్రం గురువారం విజయవంతంగా విడిపడింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన తర్వాత నెల రోజులపాటు ప్రొపల్షన్ మోడ్‌లోనే ల్యాండర్ మాడ్యూల్ విక్రం ఉన్నది. ఈ విషయాన్ని ఇస్రో తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్టింగ్‌లో తెలిపింది. ఇప్పుడు ఉన్న కక్ష్యకంటే దిగువకు శుక్రవారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేగం తగ్గించుకుని […]

chandrayaan-3 |
బెంగళూరు: చంద్రయాన్-3 కీలక దశలోకి ప్రవేశించింది. అత్యంత కీలకమైన లాండింగ్‌కు ముందు ప్రొపల్షన్ మోడ్ నుంచి ల్యాండర్ విక్రం గురువారం విజయవంతంగా విడిపడింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన తర్వాత నెల రోజులపాటు ప్రొపల్షన్ మోడ్‌లోనే ల్యాండర్ మాడ్యూల్ విక్రం ఉన్నది.
ఈ విషయాన్ని ఇస్రో తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్టింగ్‌లో తెలిపింది. ఇప్పుడు ఉన్న కక్ష్యకంటే దిగువకు శుక్రవారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేగం తగ్గించుకుని దిశ మార్చుకుంటుందని పేర్కొన్నది.
ఆరు రోజుల్లో అంటే.. ఈ నెల 23న చంద్రునిపై కాలుమోపనున్నది. ఆ రోజు సాఫ్ట్‌లాండింగ్ కోసం ఇస్రో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. సాఫ్ట్ లాండింగ్ ప్రక్రియ 15 నిమిషాలపాటు ఉంటుంది. దీనిని ‘భయానక సమయం’గా పేర్కొంటారు. ఈ సమయంలోనే చంద్రయాన్-2 విఫలమైంది.