TS EAMCET | TS ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు

విధాత‌: టీఎస్ ఎంసెట్ (TS EAMCET) ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్, టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల కార‌ణంగా ఇంజినీరింగ్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను మార్చిన‌ట్లు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది. మే 7 నుంచి 9వ తేదీల‌ మ‌ధ్య‌లో నిర్వ‌హించాల్సిన‌ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల‌ను మే 12 నుంచి 14వ తేదీల మ‌ధ్య‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌ల ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేద‌ని, ఆ ప‌రీక్ష‌ల‌ను మే 10, 11 తేదీల్లో […]

  • By: Somu    latest    Mar 31, 2023 11:39 AM IST
TS EAMCET | TS ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు

విధాత‌: టీఎస్ ఎంసెట్ (TS EAMCET) ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్, టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల కార‌ణంగా ఇంజినీరింగ్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను మార్చిన‌ట్లు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

మే 7 నుంచి 9వ తేదీల‌ మ‌ధ్య‌లో నిర్వ‌హించాల్సిన‌ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల‌ను మే 12 నుంచి 14వ తేదీల మ‌ధ్య‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌ల ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేద‌ని, ఆ ప‌రీక్ష‌ల‌ను మే 10, 11 తేదీల్లో య‌థాత‌థంగా నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని ఎంసెట్ రాసే విద్యార్థులు గ్ర‌హించాల‌ని అధికారులు సూచించారు.

అయితే మే 7వ తేదీన నీట్ యూజీ ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్నారు. మే 7, 8, 9 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ ప‌లు ప‌రీక్ష‌లను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్చాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు