నల్లగొండ: ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చత్రపతి చౌహన్
విధాత, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఈ నెల 25నుండి రెండు రోజుల పాటు జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 68వ జాతీయ మహాసభల సందర్భంగా జాతీయ అధ్యక్షుడు డా.రాజ్ శరణ్ షాహి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నాయకుడు చత్రపతి చౌహన్ ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు. చత్రపతి చౌహన్ మహత్మా గాంధీ యూనివర్సిటీలో MBA చదువుతున్నారు. గతంలో ఇంటర్ కాలేజీ […]

విధాత, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఈ నెల 25నుండి రెండు రోజుల పాటు జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 68వ జాతీయ మహాసభల సందర్భంగా జాతీయ అధ్యక్షుడు డా.రాజ్ శరణ్ షాహి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నాయకుడు చత్రపతి చౌహన్ ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు. చత్రపతి చౌహన్ మహత్మా గాంధీ యూనివర్సిటీలో MBA చదువుతున్నారు.
గతంలో ఇంటర్ కాలేజీ హాస్టల్ కార్యదర్శిగా, నల్గొండ జిల్లా ట్రైబల్ సెల్ కన్వీనర్‌గా, నల్గొండ ఉమ్మడి జిల్లా ట్రైబల్ సెల్ కన్వీనర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కార్యసమితి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చత్రపతి చౌహన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు డా.రాజ్ శరణ్ షాహి, తన నియామకానికి సహకరించిన అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర ప్రముక్ మసాడి బాపురావు, రాష్ట్ర అధ్యక్షుడు డా.శంకర్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి కరుణాకర్, రాష్ట్ర సహా సంఘటన కార్యదర్శి లవన్ కుమార్ రెడ్డి, నల్గొండ విభాగ్ సంఘటన కార్యదర్శి లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల్లో జాతీయవాద భావన పెంచటానికి కృషి చేస్తానని తెలిపారు.