చౌటుప్పల్ పోయింది.. చండూర్ కూడా పోతే!
విధాత: మునుగోడు అర్బన్ ఓట్లపై బీజేపీ మొదటి నుంచి పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అర్బన్ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఆయా అర్బన్ ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షో తర్వాత పరిస్థితి మారినట్టు విధాత క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. https://vidhaatha.com/news/munugodu-ṭrs-de దానికి తగ్గుట్టుగానే చౌటుప్పల్‌లో బీజేపీ ఆశించిన ఓట్లు రాలేదని ఆ పార్టీ అభ్యర్థినే ప్రకటించడం విశేషం. చౌటుప్పల్ పోయింది కాబట్టి బీజేపీ చండూర్‌పై ఆశలు పెట్టుకున్నది. అక్కడ […]

విధాత: మునుగోడు అర్బన్ ఓట్లపై బీజేపీ మొదటి నుంచి పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అర్బన్ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఆయా అర్బన్ ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షో తర్వాత పరిస్థితి మారినట్టు విధాత క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది.
https://vidhaatha.com/news/munugodu-ṭrs-de
దానికి తగ్గుట్టుగానే చౌటుప్పల్‌లో బీజేపీ ఆశించిన ఓట్లు రాలేదని ఆ పార్టీ అభ్యర్థినే ప్రకటించడం విశేషం. చౌటుప్పల్ పోయింది కాబట్టి బీజేపీ చండూర్‌పై ఆశలు పెట్టుకున్నది. అక్కడ కూడా చౌటుప్పల్ ఫలితమే పునరావృతమైతే ఇక టీఆర్‌ఎస్ గెలుపు సులువే అన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది.
అంతేకాదు చండూరు, మునుగోడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టే ఉన్నది. ఆ పార్టీకి ఓట్లు బాగానే పడుతాయని అక్కడి ప్రజలను కలిసినప్పుడు చెప్పారు. వాళ్ల మాట నిజమైతే కమలం పార్టీకి గెలుపు కష్టమే అన్న వాదన కూడా వినిపిస్తున్నది.