Maggots in Chicken | ఈ వీడియో చూశారంటే.. రెస్టారెంట్లలో చికెన్ ఆర్డరివ్వాలంటే భయపడతారు!
Maggots, Chicken | విధాత: చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇంట్లో తయారు చేసే చికెన్ బోరు కొడితే రెస్టారెంట్లకు వెళ్లి వెరైటీ చికెన్(Chicken) రెసిపీని ఆర్డర్ చేయడం చాలా మంది చేసే పనే. కానీ.. ఈ వీడియో చూశారంటే.. మీ కడుపులో ఉన్నవన్నీ.. తిన్నవన్నీ బయటకు రావడమే కాదు.. బయట రెస్టారెంట్లలో చికెన్ తినడానికి మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇంట్లో వండుకునే చికెన్‌కు, బయట రెస్టారెంట్లలో దొరికే చికెన్‌కు టేస్ట్‌లో చాలా […]

Maggots, Chicken |
విధాత: చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇంట్లో తయారు చేసే చికెన్ బోరు కొడితే రెస్టారెంట్లకు వెళ్లి వెరైటీ చికెన్(Chicken) రెసిపీని ఆర్డర్ చేయడం చాలా మంది చేసే పనే. కానీ.. ఈ వీడియో చూశారంటే.. మీ కడుపులో ఉన్నవన్నీ.. తిన్నవన్నీ బయటకు రావడమే కాదు.. బయట రెస్టారెంట్లలో చికెన్ తినడానికి మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
ఇంట్లో వండుకునే చికెన్‌కు, బయట రెస్టారెంట్లలో దొరికే చికెన్‌కు టేస్ట్‌లో చాలా తేడా ఉంటుంది. అక్కడ చెయ్యి తిరిగిన షెఫ్‌లు రకరకాల పద్ధతుల్లో వండటం వలన సాధారణ చాలా మంది రెస్టారెంట్లకు వెళుతుంటారు. ఇలాగే ఒకాయన మలేషియాలో రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్‌ఫ్రై ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పడు ఆ వీడియో నెటిజన్ల గుండె గుభేల్మనిపిస్తున్నది. మలేషియా మోస్ట్ వైరల్ అనే ట్విట్టర్ పేజీలో దీన్ని పోస్టు చేశారు.
వెయిటర్ తెచ్చిన చికెన్ ఫ్రైని తినడానికి సిద్ధమైన ఆ వ్యక్తికి ఉన్నట్టుండి అనుమానం వచ్చింది. టేస్ట్ ఏదో తేడా అనిపించింది. ఏంటా అని ముక్కను విడదీసి చూస్తే.. అందులో ఎంచక్కా అటూఇటూ కదులుతూ చిన్న చిన్న పురుగుల కుటుంబమే కనిపించింది. అగ్గిమీద గుగ్గిలమైన సదరు కస్టమర్ తనకు ఆ చికెన్‌ను సర్వ్ చేసిన వెయిటర్‌ను పిలిచి.. అందులో పురుగులను చూపించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఈ మొత్తాన్నీ మరో వ్యక్తి రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. తింటూ టేస్ట్ చేయడమే కాదు.. తినడానికి ముందు చెక్ చేసుకోవాలంటూ పలువురు కామెంట్లు పెట్టారు. అందుకే నేను బయట చాలా అరుదుగా చికెన్ తింటా అని ఒకరు పెడితే.. ఈసారి తినేటప్పడు చెక్ చేసుకోండి.. అని మరొకరు సలహా ఇచ్చారు. కొత్త భయం అన్ లాక్ అయింది అని ఒకరు కామెంట్ పెట్టారు.
ఏది ఏమైనా బయట ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అందులోనూ ఇది వేసవి కాలం. ఆహారం చాలా త్వరగా పాడైపోతుంది. ఇంత రిస్కు ఎందుకంటారా? మీ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో మంచిగా చికెన్ వండించుకుని, తిని, ఆస్వాదించండి. లేదూ.. బయటి ఫుడ్ మాకు ఇష్టం అంటారా? ఇక మీ ఇష్టం!